పోలీస్ అధికారి మహిళ పట్ల మానవత్వాన్ని చాటుకున్నారు. రైల్వే స్టేషన్ లో ఓ మహిళను భుజాన మోసుకెళ్లి ట్రైన్ ఎక్కించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోలీస్ అధికారిపై ప్రశసంల వర్షం కురుస్తోంది.
సాధారణంగా పోలీసులంటే కొంత మంది భయపడిపోతుంటారు. నేరాలను అదుపు చేసే క్రమంలో పోలీసులు కొంత కఠినంగా వ్యవహరిస్తారు. మరికొంత మంది దురుసుగా ప్రవర్తిస్తూ ప్రజలను భయానికి గురిచేస్తుంటారు. కానీ అందరు పోలీసులు అలా ఉండరు. రాత్రనకా పగలనకా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ రక్షణ కల్పిస్తూ విధులు నిర్వహిస్తుంటారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ మానవత్వాన్ని చాటుకుంటారు. ఎక్కడ ప్రమాదం జరిగినా, ఎక్కడ ఆపద వచ్చినా వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపడతారు పోలీసులు. ఇదే రీతిలో రైల్వే స్టేషన్ లో నడవలేని స్థితిలో ఉన్న ఓ మహిళను భుజాన మోసుకెళ్లి రైలు ఎక్కించాడు ఓ ఎఎస్ఐ. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రైల్వే స్టేషన్ లలో హఠాత్తుగా జరిగే సంఘటనలు హృదయాలను కలిచివేస్తాయి. అనుకోకుండా జరిగే ప్రమాదాలు తీరని శోకాన్ని మిగుల్చుతాయి. ఇప్పటి వరకు రైల్వే స్టేషన్ లలో ప్రమాదాల భారి నుంచి రైల్వే పోలీసులు కాపాడిన ఘటనలు చాలానే ఉన్నాయి. కాగా ఇక్కడ ఓ పోలీస్ అధికారి, ఆపరేషన్ చేయించుకుని నడవలేని స్థితిలో ఉన్న మహిళను భుజాలపై ఎత్తుకుని వెళ్లి ట్రైన్ ఎక్కించాడు. వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఎఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న మాన్ సింగ్ అనే పోలీస్ అధికారి శస్త్ర చికిత్స చేయించుకుని నడవలేని స్థితిలో ఉన్న మహిళను తన భుజాలపై మోసుకెళ్లి ట్రైన్ ఎక్కించాడు. నిస్సాహాయ స్థితిలో ఉన్న మహిళకు సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఎఎస్ఐ చేసిన ఈ గొప్ప పనికి నెటిజన్స్ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.