చైనాలోని వుహాన్‌లో పుట్టిన కరోనా వైరస్ అక్కడ రెండు వేల మందికి పైగా బలిగొని ఇతర దేశాలకు కూడా వ్యాపించేసింది. ఇప్పుడు భారత్ కు కూడా వ్యాపించింది. ఇక్కడి ప్రజలను హడలెత్తించేస్తోంది. దాంతో కొందరు సినీ ప్రముఖులు కరోనా నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి. అనే విషయాన్ని తమకు తోచిన టిప్స్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. వ్యాక్సినేషన్, మాస్క్ ధారణ, పాటించాల్సిన జాగ్రత్తలపై సెలెబ్రిటీలు ఎప్పటికప్పుడు తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మాస్క్.మనిషి శరీరంలో ఇప్పుడొక ఆభరణంగా మారిపోయింది. కరోనానుంచి రక్షించుకోవాల్సిన క్రమంలో ‘మాస్క్’ అతి ముఖ్యమైనదన్న విషయం తెలిసిందే. అందుకే మార్కెట్లో విభిన్న రకాల మాస్క్‌లు అందుబాటులో వచ్చాయి. ఈ తరుణంలో ప్రముఖ సంగీత దర్శకుడు, ఏఆర్ రెహమాన్ ధరిస్తున్న మాస్క్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.
ఈ మాస్క్ ప్రత్యేకత… ‘మినీ ఎయిర్ ప్యూరిఫయర్’ – అంటే గాలిని అప్పటికప్పుడు ప్యూరిఫై చేసి లోపలకు పంపిస్తుంది. H – 13 గ్రేడ్, HEPA ఫిల్టర్, 99.7% ప్యూరిఫికేషన్ చేసే ఈ మాస్క్ చూడడానికి కూడా కాస్త వెరైటీగా ఉండటంతో నెటిజన్లు కామెంట్లు ప్రారంభించారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్., టాప్ రేంజ్ మ్యూజిక్ డైరక్టర్, వరల్డ్ వైడ్ ఐకాన్ రెహమాన్ రేంజ్ సెలెబ్రిటీ ఈ మాస్క్ పెట్టుకున్నాడంటే కాస్ట్ చాలా ఉంటుందని అంచనా వేస్తున్నారు. నెట్టింట్లో కూపీలాగారు – కొందరు ఔత్సాహికులు. ధర జస్ట్ 18 వేల పైమాటే. అది అతగాడి రేంజ్ కి తక్కువే అయినా టెక్నాలజీ విషయంలో టాప్ ప్లేస్. మనలాంటివారికి ఆకాశంలో ఉన్నట్టే దాని ధర. అందుకే ఏఆర్ రెహమాన్ మాస్క్ హాట్ టాపిక్‌గా మారింది.