కామెడీతో పాటు హీరోయిజంతో కూడిన కథలు రాసుకుని హిట్స్ కొడుతున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్సే. ముందు మాటల రచయితగా సినిమా పరిశ్రమలోకి వచ్చిన అనిల్..పటాస్‌తో డైరెక్టర్ గా మారారు.
టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరు అనిల్ రావిపూడి. కామెడీతో పాటు హీరోయిజంతో కూడిన కథలు రాసుకుని హిట్స్ కొడుతున్నారు. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్సే. ముందు మాటల రచయితగా సినిమా పరిశ్రమలోకి వచ్చిన అనిల్ రావిపూడి శౌర్యం, శంఖం,కందిరీగ, ఆగడు, పండగ చేస్కో వంటి సినిమాలతో మాటల రచయితగా పనిచేశాడు. ఆ తర్వాత డైరెక్టర్‌గా మారి పటాస్‌తో కళ్యాణ్ రామ్‌కు భారీ హిట్‌ను ఇచ్చాడు. భార్య భర్తల మధ్య గొడవలు, కుటుంబ సమస్యలను తన సినిమాలోకి వాడి.. కామెడీని పండిస్తున్నారు. అంతేకాదూ ఆయన మల్టీ టాలెండెట్.
ఫన్నీ ఇంటర్వ్యూలు చేస్తారు. సినిమా ప్రమోషన్లు చేస్తారు. ఇమిటేట్ చేస్తారు. పాడతారు, షాట్స్, రీల్స్ కూడా చేస్తుంటారు. ఆయన ఏదీ చేసిన ఆ వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ఎఫ్ -3 సక్సెస్ తర్వాత ప్రస్తుతం ఆయన బాలకృష్ణతో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ఎటువంటి పేరును ఖరారు చేయలేదు. అంతేకాకుండా ఎటువంటి అప్ డేట్స్ ఇవ్వడం లేదు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ లో ఉన్నారు. వీరిని ఖుషీ చేసేందుకు స్వయంగా రంగంలోకి దిగాడు అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడిలో మంచి కామెడీ టైమింగ్ ఉన్న డైరెక్టరే కాదూ.. మంచి డ్యాన్సర్ కూడా. ఎఫ్ -3 సినిమా సమయంలో కుర్రాడు బాబోయ్ సాంగ్ కు హీరోలతో కలిసి అదిరిపోయే స్టెప్పులేసి వావ్ అనిపించాడు. ఇప్పుడు మరో సారి డ్యాన్స్ చేసి ఆయనలో హీరోలకు ఏమాత్రం తీసుపోడని నిరూపించాడు.
బాలకృష్ణతో చేస్తున్న సినిమా గురించి ఓ విషయాన్ని ఆయన ఆసక్తికరమైన రీతిలో పంచుకున్నారు. ఫైట్ మాస్టర్, డ్యాన్స్ మాస్టర్లతో కలిసి కాలు కదుపుతూ.. అదిరిపోయే స్టెప్పులు వేశారు. ‘నట్టు లూజు దానా బాలయ్య, బాలయ్య..ఫిట్టు చేయరానా’ అంటూ లారీ డ్రైవర్ సినిమాలోని పాటకు డ్యాన్సులు చేశారు. ఇందులో ఇప్పటికే ఫైట్స్ ముగిసినట్లు తెలుస్తోంది. ఇక పాటలపై కసర్తుతులు మొదలు పెడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ రీల్ వీడియో తెగ వైరల్ అవుతుంది. దీనికి నెటిజన్ల నుండి కామెంట్లు వస్తున్నాయి. మీరు హీరోగా ట్రై చేయొచ్చు కదా.. మీరు మంచి డైరెక్టరే కాదూ.. మంచి డ్యాన్సర్ కూడా అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈసినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మూవీపై అంచనాలను పెంచేశాయి.