మనిషి జీవితంలో మంచం ఓ నిత్యవసరం. కొంతమంది మంచం మీదే నిద్రించటానికి ఇష్టపడతారు. ఒక్క రోజు మంచం మీద పడుకోకపోయినా వారికి ఏదోలా అనిపిస్తూ ఉంటుంది.
కాలం మారింది. కాలంతో పాటు మనుషుల అలవాట్లు, ఆలోచనల్లో కూడా పెనుమార్పు వచ్చింది. మన పూర్వీకులు పాటించిన నాటు పద్దతులు వస్తువులు రాను రాను దూరం అవుతూ వస్తున్నాయి. వాటి స్థానంలో ప్లాస్టిక్‌తో తయారైన వస్తువులే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే, ప్లాస్టిక్ కారణంగా తలెత్తున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని కొంతమంది మళ్లీ సహజ సిద్ధమైన పాత తరపు వస్తువుల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని కంపెనీలు వాటిని క్యాష్ చేసుకునే పడ్డాయి.
మార్కెట్‌లో డిమాండ్ ఉన్న భారత దేశపు సంప్రదాయ వస్తువులను అమ్మకానికి పెడుతున్నాయి. తాజాగా, ఓ కంపెనీ భారత దేశానికి చెందిన నులక మంచాలను అమ్మకానికి పెట్టింది. అది కూడా ఏకంగా లక్ష రూపాయలకు ఆన్‌లైన్‌లో బేరం పెట్టింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన ఓ ప్రముఖ ఆన్‌లైన్ సంస్థ భారత దేశానికి చెందిన నులక మంచాలను అమ్మకానికి పెట్టింది. ‘భారత దేశపు సంప్రదాయ.. మంచిగా అలంకరించిన మంచం’ అని పేర్కొంది. ఆ నులక మంచం ధర 1320 డాలర్లుగా ఉంది. అదే ఇండియన్ కరెన్సీలో అయితే అక్షరాలా లక్షకు పైగా రూపాయలు అన్నమాట.
ప్రస్తుతం ఈ మంచం వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఆ వైరల్ న్యూస్‌పై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ మంచం లక్ష రూపాయలా.. ఆ డబ్బుతో 50 మంచాలు కొనొచ్చు’’.. ‘‘ భారత దేశ సంప్రదాయం సైన్స్‌తో కూడుకున్నది. ఆ నులక మంచాలతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి’’..‘‘ నులక మంచం ఇంత రేటంటే.. మా ఇంట్లో రెండు,మూడు మంచాలు ఉన్నాయి. వింటేజ్ మంచాలు. వాటికి ఎంత ఇస్తారు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, నులక మంచం లక్ష రూపాయలకు అమ్ముడవుతున్న ఈ న్యూస్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.