నేటికాలంలో మనిషిలో మానవత్వం అనేది కనుమరుగై పోతుంది. ఇంకా చెప్పాలంటే కొందరిలో మనిషి కంటే రాక్షసుడు ఎక్కువగా కనిపిస్తున్నాడు. అందుకు ప్రతి నిత్యం జరిగే ఎన్నో దారుణ ఘటనలే నిదర్శనం. 100 రూపాయల కూడా సాటి మనిషి ప్రాణాన్ని తీసేస్తున్నారు. అభంశుభం తెలియన చిన్నారులపై లైంగిక దాడులు, హత్యలు చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు అనేక ఘటనలను నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతునే ఉన్నాయి. తాజాగా ఓ ప్రభుత్వ అంబులెన్స్ డ్రైవర్ మానవత్వానికి మాయని మచ్చ తెచ్చాడు. కాసుల కక్కుర్తితో నిండు గర్భిణీని అడవిలోని రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు. ఉత్తర్ ప్రదేశ్ లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే..
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను రాజేష్ సాహూ అనే జర్నలిస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో అతడు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లా పండరి గ్రామంలో జరిగింది. కేవలం రూ.1000 కోసం పురిటి నొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణితో పాటు ఆమె బంధువులను కూడా అంబులెన్స్ డ్రైవర్ దట్టమైన అడవిలో రోడ్డుపై వదిలేసి వెళ్లాడు. తమ బిడ్డ పురిటికి పురిటి నొప్పులు వస్తే ప్రభుత్వ అంబులెన్స్ ఫోన్ చేస్తే వచ్చి.. ఎక్కించారని సదరు గర్భిణీ కుటుంబ సభ్యులు తెలిపారు. మార్గం మధ్యలో అంబులెన్స్ డ్రైవర్ రూ.1000 అడిగాడని, అంత డబ్బులు తమవద్ద లేవని చెప్పడంతో నిర్దాక్షిణ్యంగా అడవిలో వదిలేసి వెళ్లాడని గర్భిణి కుటుంబ సభ్యులు ఆరోపించారు. నొప్పులతో ఆ మహిళ రోడ్డు పక్కన బాధపడుతూ కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. అంబులెన్స్ డ్రైవర్ మరియు దాని నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరి.. ఈ ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
यूपी में एंबुलेस कंपनी और उनके ड्राइवरों की बदमाशी कौन नहीं जानता।
ये वीडियो हमीरपुर के पंधरी गांव का है। परिवार के पास देने के लिए 1000 नहीं थे इसलिए गर्भवती महिला को सड़क पर ही छोड़ दिया।
इतने निर्मम लोगों हैं कि क्या ही कहा जाए। pic.twitter.com/So8OKthLsP
— Rajesh Sahu (@askrajeshsahu) September 6, 2022