ఓ వ్యక్తికి సోషల్ మీడియా ద్వారా ఓ అమ్మాయి పేరుతో రిక్వెస్ట్ వచ్చింది. వెంటనే యాక్సెప్ట్ చేస్తూ ఛాటింగ్ చేయడం మొదలు పెట్టాడు. ఇద్దరూ కొన్నాళ్ల పాటు రొమాంటిక్ గా ఛాటింగ్ చేసుకుని ప్రేమ వరకు వెళ్లారు. ఇటీవల ఓ చోట కలుసుకున్నారు. కానీ, అతడికి అసలు విషయం తెలియడంతో ఫీజులు ఔట్ అయ్యాయి. అసలేం జరిగిందంటే?
ప్రస్తుతం సోషల్ మీడియా యుగం కొత్త పుంతలు తొక్కుతోంది. దీని ద్వారా లాభం ఎంతుంటే అంతకు మించి నష్టాలు కూడా ఉన్నాయి. రోజుకి ఎంతో మంది సోషల్ మీడియా ద్వారా మోసపోతూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా చాలా మంది ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ ద్వారా తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటున్నారు. అంతటితో ఆగకుండా ప్రేమా, గీమా అంటూ కొన్ని రోజుల పాటు ఛాటింగ్ చేస్తూ చివరికి అన్ని కోరికలు తీరాక కాదు పొమ్మంటున్నారు. ఇదిలా ఉంటే.. మరికొందరు మాత్రం సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాగే ఓ వ్యక్తి ప్రేమ పేరుతో మోసపోయాడు. అసలేం జరిగిందంటే?
ఓ వ్యక్తికి సోషల్ మీడియా ద్వారా ఓ అమ్మాయి డీపీతో పాటు రిక్వెస్ట్ వచ్చింది. ఇక మనోడు అస్సలు ఆగకుండా వెంటనే ఆ రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేస్తూ ఆమెను ఫాలో అయ్యాడు. ఆ పేరు నుంచి అతడికి రోజూ మెసేజ్ లు వస్తున్నాయి. దీంతో రెచ్చిపోయిన ఆ వ్యక్తి ఆమెకు రోజూ మెసేజ్ లు చేశాడు. అమ్మాయి డీపీ నుంచి కూడా రోజూ రొమాంటిక్ మెసేజ్ లు రావడంతో ఆ వ్యక్తి అస్సలు వెనక్కి తగ్గలేదు. అలా వీరి చాటింగ్ చివరికి ప్రేమ వరకు వెళ్లింది. అయితే వీళ్లిద్దరూ అప్పుడప్పుడు వీడియో కాల్స్ కూడా మాట్లాడుకునేవారు. కానీ, మనోడికి ఓ కండిషన్ పెట్టింది. వీడియో కాల్స్ చేసినప్పుడు మాత్రం నేను ముసుగు వేసుకుంటానని. దీనికి ఆ వ్యక్తి కాదనుకుండా సరే అంటూ అంగీకరించాడు. ఇక ముసుగులోనే వాళ్లిద్దరూ రోజూ వీడియో కాల్స్ మాట్లాడుకునేవారు.
కానీ, ఆ వ్యక్తి తన ప్రియురాలిని ఫేస్ టూ ఫేస్ చూడాలని చాలా సార్లు అడిగాడు. దానికి ఆ అమ్మాయి నుంచి ఇప్పట్లో కుదరదంటూ పోస్ట్ పోన్ చేస్తూ వచ్చింది. ఇక ఇటీవల ఎలాగైనా ప్రియురాలిని దగ్గర నుంచి చూడాలని అతడు ఫిక్స్ అయ్యాడు. దీనికి ఇద్దరు సరే అనుకుని ఓ చోట కలుసుకున్నారు. చూడాలని ఎంతో ఆతృతగా వెళ్లిన ఆ వ్యక్తికి అక్కడ కూడా నిరాశే ఎదురైంది. ఆ అమ్మాయి ముసుగు వేసుకునే దూరం నుంచి మాట్లాడే ప్రయత్నం చేసింది. కానీ, ఎందుకు అతడికి అనుమానం వచ్చి బలవంతంగా ఆ ముసుగు తొలగించి చూడగా.. ఆమె అమ్మాయి కాదు, అబ్బాయి అని తెలుసుకుని షాక్ గురయ్యాడు. ఇంత మోసం చేస్తావా అంటూ ఆ యువకుడిని అతడు చితకబాదారు. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక ఇదే వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన చాలా మంది ఒక్కొరు ఒకలా కామెంట్స్ చేస్తున్నారు. ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.