ఓ మహిళ పోలీసులకే చుక్కలు చూపించింది. పోలీస్ స్టేషన్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఆమె ప్రవర్తన పోలీసులకు కాస్త తలనొప్పిగా మారింది. ఇంతకు ఆ మహిళను పోలీసులు రక్షించారు? అసలేం జరిగిందంటే?
పోలీస్ స్టేషన్ ఎక్కి ఓ మహిళ నానా హంగామా చేసింది. ఇక్కడి నుంచి దూకి చనిపోతా అంటూ పోలీసులకే చుక్కలు చూపించింది. ఈ ఘటనతో పోలీసులు, ఆమె కుటుంబ సభ్యులు ఒక్కసారిగా తలలు పట్టుకున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఎందుకు ఆ మహిళ పోలీస్ స్టేషన్ ఎక్కి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది? అసలేం జరిగిందంటే?
అది కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా మూడిగెరె పరిధిలోని సర్వోదయనగర్ ప్రాంతం. ఇక్కడే శిల్ప అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమెకు ఓ సోదరి కూడా ఉంది. అయితే గత కొన్నేళ్ల నుంచి శిల్పకు ఆమె సోదరి మధ్య ఓ వివాదం జరిగింది. దీనిపై కోర్టులో కేసు కూడా నడుస్తుంది. గత కొంత కాలం నుంచి శిల్ప కోర్టుకు వెళ్తూ వస్తూ ఉండేది. ఈ క్రమంలోనే శిల్ప శుక్రవారం మరోసారి కోర్టుకు వెళ్లింది. ఇక అటు నుంచి నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. అక్కడికి వెళ్లి నా సమస్యను పరిష్కరించి కేసు కొట్టివేయాలని పోలీసులతో వాగ్వాదానికి దిగింది. అంతేకాకుండా స్టేషన్ వెనకాల నుంచి మెల్లగా పోలీస్ స్టేషన్ పైకి వెళ్లింది.
అనంతరం నా సమస్య పరిష్కారం కాకుంటే ఇక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగింది. దీంతో పోలీసులు, ఆమె కుటుంబ సభ్యులు ఒక్కసారిగా తలల పట్టుకున్నారు. దయచేసి కిందకు దిగాలని పోలీసులు పదే పదే కోరారు. అయినా వినని ఆ మహిళ.. దూకేస్తానంటూ హల్చల్ చేసి పోలీసులకు చుక్కలు చూపించింది. ఇక సమస్పూర్తితో వ్యవహరించిన పోలీసులు.. వెనకాల నుంచి పోలీస్ స్టేషన్ పైకి ఎక్కి శిల్పను రక్షించారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. ఆమె మానసిక పరిస్థితి సరిగ్గా లేదని, తరుచు ఏదో గొడవకు స్టేషన్ కు వస్తూ అందరినీ ఇబ్బంది పెడుతుందని తెలిపారు. సమస్య పరిష్కరించాలంటూ పోలీస్ స్టేషన్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించిన మహిళ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.