పెళ్లంటే నూరేళ్ల పంట. తాళికట్టిన వాడితే కలకాలం సంతోషంగా ఉండాలని ప్రతీ అమ్మాయి కోరుకుంటుంది. అన్నీ తానై చివరి వరకు భర్తకు తోడు నీడగా ఉండాలని అనుకుంటుంది. అచ్చం ఇలాగే భావించి ఓ అమ్మాయి తన మెడలో మూడు ముళ్లు వేసుకుంది. కానీ, పెళ్లైన కొంత కాలానికి సుఖం దక్కకపోగా.. కన్నీళ్లు స్వాగతం పలికాయి. దీంతో ఆ యువతి అత్తింట్లో ఉండలేక, భర్తకు విడాకులు ఇచ్చి తన దారి తను చూసుకుంది. పెళ్లైన వారానికే ఆ యువతి ఎందుకు విడాకులు కోరింది? దీని వెనకాల అసలేం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం.
మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. ఓ యువతికి గత కొన్ని రోజుల కిందట ఓ యువకుడితో వివాహం జరిగింది. అయితే పెళ్లి తంతులో భాగంగా అమ్మాయి తల్లిదండ్రులు రూ.25 లక్షల కట్నం ఇచ్చి ఘనంగా వివాహం చేశారు. వీరి పెళ్లికి బంధువులు అంతా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇక ఆ యువతి కూడా ఎంతో సంతోషపడింది. కానీ, ఆ కొత్త పెళ్లి కూతురు సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు. పెళ్లైన రెండు మూడు రోజుల నుంచే అత్త కోడలిని మానసికంగా అనేక వేధింపులకు గురి చేసినట్లు తెలుస్తుంది.
సూటిపొటి మాటలు అంటూ కొత్త కోడలు అని కూడా చూడకుండా హింసించింది. ఇక ఆ యువతికి పెళ్లైన కొన్ని రోజులకే సుఖం దక్కకపోగా.. కన్నీళ్లు స్వాగతం పలికాయి. ఇక ఇలాంటి జీవితం నాకు వద్దు అనుకున్న ఆ యువతి పెళ్లైన వారానికే విడాకులకు దరఖాస్తు చేసుకుంది. అనంతరం ఆ యువతి కెనడా వెళ్లింది. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను. ఎలాంటి బాధలు, కష్టాలు లేవని ఆ యువతి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఎక్కడ జరిగిందనేది మాత్రం తెలియరాలేదు. ఇదే అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.