బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన ఓ రైలు సినిమా స్టైల్ లో బస్సును ఢీ కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ అవుతోంది.
ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన ఓ రైలు సినిమా స్టైల్ లో బస్సును ఢీ కొట్టి కొంత దూరం ఈడ్చుకెళ్లింది. దీనికి సంబంధించిన ప్రమాద దృశ్యాలను కొందరు వీడియోలు తీసుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. వివరాల్లోకి వెళ్తే.. బంగ్లాదేశ్ ఢాకాలోని బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఓ రైలు వేగంగా దూసుకొచ్చి ఓ బస్సును ఢీ కొట్టి కొంత దూరం వరకు ఈడ్చుకెళ్లింది. దీనిని గమనించిన కొందరు స్థానికులు తమ సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకున్నారు.
అయితే వెంటనే స్పందించిన రైలు అధికారులు ఆ రైలును అక్కడే నిలిపివేశారు. అనంతరం రైల్వే అధికారులు అటుగా వచ్చే రైలు సర్వీసులను నిలిపివేశారు. మరో విషయం ఏంటంటే? ఈ ప్రమాద సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడం విశేషం. ఈ ఘోర ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.
— Hardin (@hardintessa143) March 23, 2023