పక్షులు, జంతువులు వాటి చేష్టలు, వింత పనులతో మనుషుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ఈ వీడియో చూస్తే ఆశ్చర్యమే కాదు… మీరు నోరెళ్లబెట్టాల్సిందే. గూట్లో పెట్టిన పండుని గుటుక్కున మింగిన చిలుకమ్మ మన అందరికీ తెలుసు. ఈ చిలుక అలాంటి ఇలాంటి చిలుక కాదండి. చేసింది దొంగ పని అయినా అది నెట్టింట చాలా వైరల్ అయ్యింది.
అసలు ఏమైందంటే ఎక్కడ జరిగిందో తెలీదు కానీ, ఓ వ్యక్తి వీడియో తీస్తుంటే ఆ చిలుక ఫోన్‌ను తినే పదార్థం అనుకుందో ఏమో గానీ, లాక్కొని అలా షికారుకు వెళ్లింది. అలా వెళ్తూ వెళ్తూ ఆ చిలుక తీసిన వీడియో నెటిజన్లకు భలే నచ్చేసింది. ఫోన్ ఏమాత్రం కదల కుండా అది వీధిలన్నీ చక్కర్లు కొడుతూ ‘బర్డ్ వ్యూ’తో మంచి దృశ్యాలను కెమెరాలో రికార్డు చేసింది. ఆ ఫోన్ మరి యజమానికి చేరిదో లేదో తెలీదు కానీ, ‘Fred Scultz’ అన్న ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియో ప్రత్యక్షమైంది.
ఆ వీడియోని చూసి అభినందించిన వారు కొందరు, అది అంతా క్రియేటడ్ వీడియో అంటూ కొట్టిపారేసినవారు కొందరు. నెటిజన్లు కొంతమంది డ్రోన్ కంటే చాలా వేగంగా వీడియో తీసిందని అభినందించారు. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కేమరూన్ తన తర్వాతి ప్రాజెక్టు కెమెరామెన్‌గా ఈ చిలుకను పెట్టుకున్నారంటూ చలోక్తులు విసురుతున్నారు. మరి ఆ వైరల్ వీడియోని మీరు ఓసారి చూసేయండి. మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలయజేయండి.
Parrot takes the phone on a fantastic trip. 😳🤯😂🦜 pic.twitter.com/Yjt9IGc124
— Fred Schultz (@fred035schultz) August 24, 2021