ఒకప్పుడు విన్యాసాలు సర్కస్ చేసే వాళ్ల వద్ద చూసే వాళ్లం. ఇప్పుడు సర్కస్ వాళ్లు పెద్దగా కనిపించకపోయినా.. అలాంటి విన్యాసాలు చేసేవాళ్లకు సోషల్ మీడియాలో కొదవలేదు. ఫేమస్ అవ్వాలన్న ఒక్క కారణంమే వాళ్లను అన్ని ఫీట్లు చేసేలా చేస్తుంది. ఫేమస్ కావటం మంచిదేకాని దానికోసం ప్రాణాల మీదకు తెచ్చుకునేలా ప్రయోగాలు చేయడం సరైంది కాదు. అలా ఓ వ్యక్తి చేసిన బైక్ స్టంట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఓ వ్యక్తి చేసిన విన్యాసం అందరినీ ఆశ్చర్య పరచడంతో పాటు.. నవ్వులు పువ్వులు పూయిస్తోంది. అతను ఏదో చేసి అందరి మెప్పు పొందాలనుకుంటే.. అక్కడ ఏదో జరిగింది పాపం. అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి బోల్తా కొట్టాడు పాపం ఆ బుల్లోడు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను ‘హోల్డ్ మై బీర్’ అనే పేరుతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఏది ఏమైనా పేరు కోసం ప్రయత్నించడం మంచిదే.. కానీ అదే మన ప్రాణలపైకి తెచ్చేలా ఉండకూదు. మరి ఆ వైరల్ వీడియోని మీరు చూసేయండి.