ఉత్తర్ ప్రదేశ్ లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. తన ఇద్దరు భార్యలు నడి రోడ్డుపై కొట్టుకోవడంతో భర్త వారిని కంట్రోల్ చేయలేక చేతులెత్తేశాడు. దీనిని చూసిన కొందరు స్థానికులు ఆపేందుకు ప్రయత్నించగా పోగా పైగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇదే వీడియోలు ఇప్పడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఆ మహిళలు ఎందుకు కొట్టుకుంటున్నారనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తర్ ప్రదేశ్ లోని ఫరూఖాబాద్ మొహల్లా మౌదర్వాజ ప్రాంతంలో దేవేంద్ర కుమార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి కిరణ్, పుష్ప అనే ఇద్దరు భార్యలు ఉన్నారు.
అయితే ఇటీవల దేవేంద్ర కుమార్ కు ఆరోగ్యం బాగా లేకపోవడంతో స్థానిక ఆస్పత్రికి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న అతని ఇద్దరి భార్యలు భర్త ఉన్న ఆస్పత్రికి పరుగు పరుగున వచ్చారు. కాగా ఇక్కడే ఏదో విషయం మీద ఇద్దరి భార్యలు గొడవ పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న భర్త ఆస్పత్రి నుంచి బయటకు వచ్చి తన ఇద్దరి భార్యలు కొట్టుకుంటుండడంతో వారిని అదుపు చేసే ప్రయత్నం చేశాడు. కానీ ఫలితం లేకపోవడంతో తన చెప్పుతో ఇద్దరి భార్యలను చితకబాదాడు. అయినా వారిద్దరిని కంట్రోల్ చేయడం భర్త తరం కాకపోవడంతో చివరికి చేతులెత్తేశాడు. ఇక వారిద్దరు మహిళలు కొట్టుకోవడంతో కొందరు వ్యక్తులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. దీంతో ఆ ఇప్పుడు కాస్త వీడియోలు వైరల్ గా మారుతున్నాయి.
दो शादियां करने का अंजाम मामला फर्रुखाबाद उत्तर प्रदेश का बताया जा रहा है पति ने दोनों पत्नियों को मारा pic.twitter.com/c4sN9u4MYq
— Ikram Husain Azad ( BHIM ARMY ) (@fbdikram) October 23, 2022