దాంపత్య జీవితంలో అరమరికలు, గిల్లిగజ్జాలు సర్వ సాధారణం. ప్రేమ ఉన్న దగ్గరే గొడవలు జరుగుతాయి అని నానుడి కూడా అందరికీ తెలిసిందే కదా. అయితే ఎలాంటి గొడవలు, గిల్లగజ్జాలు లేకుండానే తన భర్తపై ఓ భార్యకు విపరీతంగా కోపం వచ్చింది. ఆ కోపంలో ఆమె చేసిన పని ఇప్పుడు ఆన్ లైన్ లో ట్రెండ్ అవుతోంది. భర్తకు ఉన్న ఓ అలవాటు తనకు నచ్చడం లేదని.. ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టేసింది. అవునండి ‘Husband For Sale’ అంటూ నట్టింట్లో ఉండే భర్తను నెట్టింట అమ్మకానికి పెట్టేసింది.
మెక్ అలిస్టర్, రోమింగ్ దంపతులు న్యూజిలాండ్ లో నివాసముంటున్నారు. తాజాగా తన భర్త పేరు మీద ఓ పోర్టల్ ను క్రియేట్ చేసి భార్య ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టేసింది. పైగా తన భర్త గుణగణాలను కూడా చాలా గొప్పగా రాసుకొచ్చింది. అంతేకాదండి.. ఫ్రీ షిప్పింగ్ అంటూ అదిరే ఆఫర్ కూడా ఇచ్చింది. నా భర్త ఒక రైతు.. ‘ఆరడుగులు ఉంటాడు- నిజాయితీ పరుడు’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. ఆ పోస్టుకు యూజ్డ్ కండిషన్ అని ట్యాగ్ కూడా పెట్టింది. భర్త అమ్ముడు కాకపోయినా.. ఈ యాడ్ మాత్రం నెట్టింట వైరల్ గా మారింది.
అసలు ఆమె అలా ఎందుకు చేసిందిన్న విషయం తెలిస్తే షాకవుతారు. తన భర్తకు వాకింగ్ చేసే అలవాడు ఉందని.. అది తనకు నచ్చడం లేదని తెలిపింది. సెలవుల్లోనూ తన ఉంట్లో ఉండి పిల్లలను చూసుకోకుండా వాకింగ్ వెళ్లిపోతాడని. భర్తతో గడపడమంటే తనకు ఇష్టమని.. కానీ భర్త మాత్రం వాకింగ్ కే ప్రియారిటీ ఇస్తున్నాడంటూ హర్ట్ అయ్యి అలా చేసిందంట. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.