మనం తాగే వాటర్ బాటిళ్లలో కానీ కూల్ డ్రింక్స్ లో కానీ అప్పుడప్పుడు బొద్దింకలు, ఎలుకలు, పాములు వంటివి కనిపించిన ఘటనలు అనేకం చూశాము. అచ్చం ఇలాగే ఇటీవల మద్యం సీసాలో చనిపోయిన కప్ప దర్శనమిచ్చింది. ఇటీవల వెలుగు చూసిన ఈ వింతైన ఘటనతో స్థానికలు షాక్ కు గురవుతున్నారు. అసలు ఎక్కడ జరిగింది? ఎలా జరిగిందనే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. కోర్బాలోని హర్దిబజార్ లో ప్రభుత్వ మద్యం షాపులో ఓ యువకుడు ఇటీవల మద్యం బాటిల్ ను కొనుగోలు చేశాడు.
అతను కొనుగోలు చేసిన ఆ మద్యం బాటిల్ ను తాగేందుకు అని ఓపెన్ చేసి చూశాడు. కానీ అందులో ఏదో మెదులుతున్నట్లు కనిపెట్టిన ఆ యువకుడు ఏంటని చూడగా.. అందులో చనిపోయిన కప్ప దర్శనమిచ్చింది. దీనిని చూసి ఆ యువకుడు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఇక వెంటనే తాను మద్యం కొనుగోలు చేసిన షాప్ వద్దకు వెళ్లి అడగగా.. ఇలాంటి ఘటన ఎప్పుడు జరగలేదని వినియోగదారుడికి చెప్పాడు. గోదాంలలో నిల్వచేసిన మద్యం సీసాలను నేరుగా షాపుకు తీసుకొస్తామని, ఇక నుంచి ఇలాంటివి జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని వినియోగదారుడికి హామీ ఇచ్చాడు.
ఇక మద్యం సీసాలో కనిపించిన ఆ కప్పను స్థానికులు ఫొటో తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ ఫొటో తక్కవు సమయంలోనే కాస్త వైరల్ గా మారింది. ఇటీవల ఛత్తీస్ గఢ్ లో వెలుగు చూసిన ఈ వింత ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతుంది. ఇలా మద్యం సీసాలో చనిపోియిన కప్ప కనిపించడంతో స్థానికులు అంతా భయందోళనకు గురవుతున్నారు. అయితే గతంలో అనేక చోట్ల వాటర్ బాటిల్, కుల్ డ్రింక్స్ లలో ఎలుకలు, పాములు, బొద్దింకలు వంటివి వచ్చిన సంగతి తెలిసిందే.