సమాజంలో ఎంతో మంది కుల, మత బేధాలు చూడకుండా ప్రేమలో పడిపోతుంటారు. వారి ప్రేమాయణం అలా కొన్నేళ్లు గడిచాక పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. కానీ కులాలు, మతాలు వేరు కావడంతో చాలా మంది తల్లిదండ్రులు వీరి ప్రేమ పెళ్లిళ్లకు అంగీకరించరు. అయినా సరే ఆ ప్రేమికులు పెద్దలను ఎదురించి మరీ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఇలా ఎంతో మంది వయసు తేడా చూడకుండా ప్రేమలో పడిపోతుంటారు. అయితే అచ్చం ఇలాగే ఓ మధ్య వయసు జంట లేటు వయసులో ఘాటు ప్రేమ అంటూ నిజం చేసి చూపించింది.
చెన్నైకి చెందిన ఈ జంట చికిత్స కోసం వచ్చి ప్రేమలో పడ్డారు. ఇక శుక్రవారం పెళ్లి కూడా జరిగినట్లు సమాచారం. ఇదే అంశం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలు వీళ్లు ఎవరు? ఈ వయసులో ప్రేమ, పెళ్లి ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. చెన్నైలోని వెల్లూరుకు చెందిన దీప (36) అనే మహిళ తండ్రి గతంలో మరణించాడు. దీంతో అప్పటి నుంచి ఆమె మానసికంగా బాధపడుతూ వస్తుంది. కాగా స్థానికుల సమాచారం మేరకు దీప చెన్నైలోని కల్పకం అనే మానసిక వైద్యశాలకు వెళ్లి అక్కడే కొన్ని రోజుల నుంచి చికిత్స తీసుకుంటూ వస్తుంది.
అయితే దీప ఇక్కడ చికిత్స తీసుకుంటున్న సమయంలోనే చెన్నైకి చెందిన మహేంద్రన్ (42) అనే వ్యక్తి కల్పకం మానసిక వైద్యశాలకు చికిత్స కోసం వచ్చాడు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఆ పరిచయమే చివరికి ప్రేమగా మారింది. దీంతో ఒకరి మనసులు ఒకరు అర్థం చేసుకున్నారు. ఇక ఆలస్యం చేయకుండా గురువారంపెళ్లి కూడా చేసుకున్నారు. అయితే ఈ జంట వీరి ప్రేమ, పెళ్లిపై స్పందిస్తూ.. దీపను తొలిసారి చూసినప్పుడు మా అమ్మలా అనిపించిందని మహేంద్రన్ తెలపగా.., మా నాన్న చనిపోయాక నేను పూర్తిగా మానసికంగా కుంగిపోయాను. దీంతో నాకు అస్సలు పెళ్లి జరగదని అనుకున్నానని దీప తెలిపింది. అయితే ఈ జంటను చూసి స్థానికులు అంతా ముచ్చటపడిపోతున్నారు.