పెంపుడు జంతువులు అంటే యజమానులకు వల్లమాలిన ప్రేమ ఉంటుంది. వాటిని సొంత మనుషుల్లానే ట్రీట్ చేస్తారు. కొన్నిసార్లు ఇంకాస్త ఎక్కువగానే చూస్తారు. సీమంతాలు చేయడం, పెళ్లిళ్లు చేయడం, ఇంకొకరైతే ఏకంగా ఆస్తులు కూడా రాశారు. ఇప్పుడు అలాంటి కోవకు చెందిందే ఈ వార్త. వీళ్లు తమ పెంపుడు కోడికి పుట్టినరోజు వేడుకలు చేశారు. రతన్ టాటా అంతటి కోటీశ్వరుడే కప్ కేక్ కోసి పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు. కానీ, ఈ కోడి(చిన్ను) మాత్రం పెద్ద కేకు కోసి, బంధుమిత్రుల ఎదుట ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొందరైతే ఒక మంచి పెట్టను చూసి పెళ్లి కూడా చేయండని సూచిస్తున్నారు. మరి, ఆ కోడికి మీరు కూడా కామెంట్స్ రూపంలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయండి.