ఇజ్రాయెల్ సముద్ర తీరంలోని అలల కారణంగా 900 ఏళ్ల నాటి అతి ప్రాచీనమైన కత్తి లభించింది. ఇక అలల కారణంగా తీరానికి చేరిన ఈ ప్రాచీన కత్తిని కనుకునేందుకు ఆర్కియాలజికల్ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుంది. 900 ఏళ్ల క్రితం నాటి నాటి రాజులు ఈ కత్తిని ఉపయోగించి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.
దీంతో పాటు క్రూసేడ్స్ 1095 , 1291 మధ్య జరిగిన మతపరమైన యుద్ధ సమయంలో ఈ ఖడ్గాన్ని ఉపయోగించి ఉంటారని ఆర్కియాలజికల్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ (IAA) ప్రకారం 3అడుగుల పొడవైన ఆయుధం మధ్యధరా సముద్రంలో హైఫా నౌకాశ్రయం సమీపంలోని సహజసిద్ధులైన బేలో కనుగొనబడిందని ఈ ఖడ్గానికి సముద్ర జీవులు ఎక్కువగా అతుక్కుపోయినప్పటికీ దాని హ్యాండిల్ డైవర్ ద్వారా అది ఖడ్గంగా నిర్దారించినట్లు అధికారులు తెలిపారు. ఒకవేళ రాజులు ఉపయోగించిన కత్తిని వేలానికి పెడితే కనుక రూ. వందల కోట్లు పలకవచ్చని తెలుస్తోంది.