జీవితంలో ఎప్పుడు ఏ అద్భుతం జరుగుంతుందో ఎవరం చెప్పలేము. అలానే ఓ 60 కార్మికుడి విషయంలో జరిగింది. రోజువారీ కూలీ చేసుకునే ఆ వ్యక్తి ఓ ఫోట్ గ్రాపర్ తీసిన ఓ ఫిక్ తో ఫేమస్ అయ్యాడు. అతనికి సంబంధంచిన ఫిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. స్థానిక న్యూస్ ఛానళ్ల కథనం ప్రకారం..
కేరళలోని కోజికోడ్ జిల్లాకు చెందిన మమ్మిక్క అనే వ్యక్తి రోజు వారి కూలీ. మమ్మిక్కును గమనించిన స్థానిక ఫోటోగ్రాఫర్ షరీక్ వయాలిల్ అతని ఫోటో తీశాడు. దానిని కాస్తా ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసాడు. ఆ కార్మికుడు నటుడు వినాయకన్ ను పోలి ఉన్నందుకు అతని ఫోటో వైరల్ గా మారింది.
దీంతో షరీక్ తనకు చెందిన వెడ్డింగ్ సూట్ కంపెనీకి మోడల్ చేయమని మమ్మికను కోరాడు. ఫోటో షూట్ కు ముందే ఈ 60 ఏళ్ల రోజూ వారి కూలీని ఇన్ స్టాగ్రామ్‌లో వేలాది మంది వీక్షించించారు. తన కంపెనీకి మోడల్‌గా చేయడానికి మమ్మిక్కా కంటే గొప్పగా ఎవరూ ఉండరని ఫోటోగ్రాఫర్ షరీక్ తెలిపాడు. మమ్మిక్కుతో చేసిన ఫోటో షూట్ సరైనదే అని ఆ ఫిక్స్ నిరూపించాయి. ఫోటోలు మమ్మిక్కా క్లాసిక్ బ్లేజర్ మరియు ప్యాంటు ధరించి, చేతిలో ఐప్యాడ్ తో స్టైలీష్ గా ఉన్నాడు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియోలో తెగ వైరల్ గా మారింది.