ఆకాశంలో ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతమౌతూ ఉంటాయి. ఇప్పటికే మనం ఎన్నో అద్భుతాలను చూశాం. మంగళవారం ఆకాశంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. 5 గ్రహాలు 50 డిగ్రీల కోణంలో ఒకే కక్షలోకి వచ్చాయి.
ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. చంద్రుడితో పాటుగా గురుడు, బుద్ధుడు, శుక్రుడు, అంగారకుడు, యురేనస్ గ్రహాలు ఒకే కక్షలో దర్శనమిచ్చాయి. ఈ అద్భుతాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వీక్షించి ఆనందిస్తున్నారు. ఈ గ్రహాలు అన్నీ సూర్యూడు చుట్టూ తిరుగుతూనే ఒక సమయంలో ఆర్క్ లాగా దృశ్యం ఆవిష్కృతమైంది. వీటిలో గురుడు, శుక్రుడు, అంగారక గ్రహాలను నేరుగా కళ్లతో చూసేందుకు వీలుంది. బుధుడు, యురేనస్ ని మాత్రం బైనాక్యులర్ లాంటి పరికరాలతో చూసే పరిస్థితి ఉంది.
ప్రపంచవ్యాప్తంగా ఈ అద్భుతాన్ని ప్రజలు వీక్షిస్తున్నారు. అయితే కృతిమ కాంతి తక్కువగా ఉన్నటువంటి గ్రామాల్లో అయితే ఎంతో స్పష్టంగా చూడచ్చు. ఎత్తైన భవనాలు, చెట్లు లాంటివి అడ్డుగా లేకుండా స్పష్టమైన ఆకాశం కనిపిస్తుంటే ఎక్కడైనా ఈ దృశ్యాలను చూడచ్చు. ఇది ఆకాశంలో పశ్చిమంగా దర్శనమిస్తున్నాయి. వీటిలో బుధుడి కంటే గురు గ్రహం మరింత ప్రకాశవంతంగా ఉండటం విశేషం. శుక్రగ్రహం ప్రకాశంగా కనిపించనుంది. దానికి దగ్గర్లో ఉండే యురేనస్ అంత ప్రకాశంగా ఉండకపోవడం వల్ల నేరుగా చూసేందుకు వీలుకాదు. కాబట్టి యురేనస్ ని మాత్రం బైనాక్యులర్ తో చూడాలంటూ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
అయితే వీటి మధ్య దూరం ఏ మాత్రం తగ్గదు. కానీ, సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో ఒకదానితో ఒకటి సరళరేఖను ఏర్పరుస్తాయి. భూమిపై నుండి చూస్తున్న సమయంలో మాత్రం ఆయా గ్రహాలు దగ్గరగా వచ్చినట్లు కనిపిస్తాయి. కానీ, వాటి మధ్య దూరం ఎప్పటిలాగానే కాంతి సంవత్సరాలు అలాగే ఉంటుంది. మీకు నేరుగా చూసేందుకు వీలు కాని పక్షంలో ఈ దృశ్యాలను టునైట్, స్కై సఫారీ వంటి సైట్లలో చూసేందుకు వీలుంది. ఈ పంచగ్రహ కూటమిని వీక్షించిన వాళ్లు మీ అనుభవాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.