సోషల్ మీడియా అన్నది ప్రజల మీద ఎంత ప్రభావం చూపుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అడుక్కుతినే వాళ్లను సైతం సెలెబ్రిటీలను చేయటం ఒక్క సోషల్ మీడియాకు మాత్రమే సాధ్యం. అంతేకాదు! కొన్ని సందర్భాల్లో అలా సోషల్ మీడియాలో ఫేమ్ తెచ్చుకోవటమే.. కొంతమంది పాలిట శాపంగా మారుతోంది. తాజాగా, కొంతమంది లేడీ కానిస్టేబుళ్లు ముద్దు పాటకు డ్యాన్స్ వేసి దాన్ని సోషల్ మీడియాలో ఉంచారు. దీంతో ఆ డ్యాన్స్ వీడియో బాగా వైరల్ అయింది. ఆ వీడియో ద్వారా వారికి చాలా పాపులారిటీ వచ్చింది. అదే వారి కొంప కూడా ముంచింది.
ఆ వీడియో చూసిన ఉన్నతాధికారులు వారిపై సీరియస్ అయ్యారు. మొత్తం అందరినీ సస్పెండ్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన లేడీ కానిస్టేబుళ్లు కవితా పాటెల్, కామిని కుశ్వాహ, కుశిస్ సాహ్ని, సంధ్యా సింగ్‌లు అయోధ్యలోని రామజన్మ భూమి ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా, వారు ‘‘ఉమ్మా’’ అనే భోజ్‌పురి ముద్దు పాటకు స్టెప్పులేశారు. ఆ సమయంలో నలుగురు సాధారణ దుస్తులు ధరించి ఉన్నారు. ఓ ముగ్గురు స్టెప్పులేయగా.. ఓ లేడీ పోలీస్ దాన్నంతా వీడియో తీసింది. తర్వాత ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆ వీడియో జెట్ స్పీడులో వైరల్ అయింది. ఆ వెంటనే అధికారుల కంట్లో కూడా పడింది. దీంతో అధికారులు నలుగురు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఏదో సరదా కోసం చేసిన ఓ చిన్న వీడియో వారి కొంప ముంచింది. ఏకంగా తిండి పెట్టే ఉద్యోగాలకే ఎసరు పెట్టింది. మరి, డ్యూటీ టైంలో వీడియోలు చేసి, సస్పెండ్ అయిన నలుగురు లేడీ పోలీసులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#Ayodhya: महिला सिपाहियों के द्वारा बनाया गया ‘पतली कमरिया तोरी’ पर रील। महिला सिपाहियों का विडियो हुआ वायराल। @ayodhya_police pic.twitter.com/YGn8rlj5cU
— Rahul kumar Vishwakarma (@Rahulku18382624) December 16, 2022