గత కొంత కాలంగా దేశంలో ప్రతిరోజూ పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అధికారులు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నా.. కొంతమంది డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు జరుగుతాయని తెలిసి కూడా కొంత మంది వాహన యజమానులు పరిమితికి మించి జనాలను తమ వాహనాల్లో ఎక్కించుకోవడంతో బ్యాలెన్స్ తప్పి ప్రమాదాలు జరగడం చూస్తూనే ఉన్నాం. ఓ ఆటో డ్రైవర్ తన ఆటోలో ఎక్కించుకున్న జనాలను చూసి పోలీసులు షాక్ తిన్నారు.. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో రోడ్డుపై వెళ్తున్న వాహనాలను చెక్ చేస్తున్న పోలీసులకు ఓ ఆటో పై అనుమానం వచ్చింది. వెంటనే ఆ ఆటోని ఆపి చెక్ చేసి చూశారు. అంతే పోలీసులు మతిపోయింది. వెంటనే ప్రయాణీకులందరినీ కిందకు దించి లెక్కించడం ప్రారంభించారు.. వారందరినీ లెక్కబెట్టి పోలీసులు షాక్ తిన్నారు. ఆ ఆటోలో డ్రైవర్‌తో సహా 27 మంది ఉన్నారు. అయితే ప్రమాదకరంగా 26 మంది ప్రయాణికులను తీసుకెళ్తున్న ఆటోను స్వాధీనం చేసుకుని డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.
ట్రాఫిక్ నిబంధనల ప్రకారం బైక్‌పై గరిష్టంగా ఇద్దరు వ్యక్తులు, ఆటోలో గరిష్టంగా నలుగురు వ్యక్తులు కూర్చోవచ్చు. కానీ కొంత మంది వాహనదారులు ఈ నియమాలను పాటించకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఒక బైక్ పై 4 ప్రయాణిస్తున్న వీడియోలు చూస్తూనే ఉన్నాం.. కొంతమంది ఆటో, మినీ వ్యాన్లలో సామర్థ్యం కంటే ఎక్కువ మందిని కూర్చోబెడుతూ ప్రయాణిస్తున్న వారి వీడియోలు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Uttar Pradesh police were left stunned after they stopped an auto only to find the driver was ferrying 27 passengers pic.twitter.com/UNqiBnkZd1
— Hindustan Times (@htTweets) July 11, 2022