పెళ్లిపై కొన్ని ఆలోచనలు ఉంటాయి అమ్మాయిలకు. అందంగా ఉండే అమ్మాయిలకే పెళ్లి చూపుల్లో నానా వంకలు పెడతారు. కాస్త ముఖం, మూతి వంకర ఉంటే ఇక అమ్మాయికి వివాహం చేయాలంటే.. ఇక తల్లిదండ్రులకు తిప్పలు అన్నీ ఇన్నీ కావు. అయితే ఆమెకు విషయంలో విధి చిన్న చూపు చూసింది.
ఆడపిల్ల పుడితే బంగారపు బొమ్మ పుట్టిందని ఆశపడతారు తల్లిదండ్రులు. అందంగా ముస్తాబు చేసి మురిసిపోతుంది తల్లి. ముద్దుముద్దు మాటలతో ఉబ్బితబ్బియిపోతాడు నాన్న. ఆమె ఎదుగుతూ ఉంటే.. ఓ అయ్య చేతిలో పెట్టేందుకు సిద్ధమవుతారు. అందంగా ఉండే అమ్మాయిలకే పెళ్లి చూపుల్లో నానా వంకలు పెడతారు. కాస్త ముఖం, మూతి వంకర ఉండే అమ్మాయికి వివాహం చేయాలంటే.. ఇక తల్లిదండ్రులకు తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఇంట్లో పెట్టుకోవడం ఇష్టం లేక రెండో పెళ్లి వాడికో, ఎక్కువ కట్నమిచ్చో కట్టబెట్టేస్తారు. కానీ ఆమె విషయంలో ఒకసారి కాదూ.. రెండు సార్లు విధి వెక్కిరించింది. ఆమె అంగవైక్యంతో బాధపడుతుంటగా.. పెళ్లి విషయంలో కూడా విధి చిన్న చూపు చూసింది.
శారీరకంగా వైకల్యమైనా.. మానసికంగా తనకంటూ పెళ్లిపై కొన్ని ఆలోచనలు ఉంటాయి అమ్మాయిలకు. అలానే ఆ యువతికి ఉంది. కానీ వైకల్యం శాపంగా మారింది. 25 ఏళ్ల వయస్సులో తన కంటే 30 ఏళ్ల వ్యక్తిని పెళ్లాడాల్సి వచ్చింది వినీత. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దౌసా జిల్లాల లాల్సోట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని బాస్ గ్రామానికి చెందిన వినీత వికలాంగురాలు. అంగ వైకల్యంగా కారణంగా లేచి నడవలేదు. దీంతో ఆమె పెళ్లి అవ్వదేమోనన్న ఆందోళనలో తల్లిదండ్రులు ఉండేవారు. ఆమెకు ఎలాగైనా పెళ్లి చేయాలన్న ఉద్దేశంతో ఓ వరుడిని వెతకడం మొదలు పెట్టారు. ఆమెకు ప్రత్యేక ప్రతిభావంతులే వస్తుండంతో భవిష్యత్తులో తమ కుమార్తెను ఎవరు చూసుకుంటారన్న ఆందోళన మొదలైంది తల్లిదండ్రుల్లో.
చివరకు ఆమె పెళ్లిపై ఆశలు వదులుకున్నారు. ఆ సమయంలో వినీత వద్దకు ఓ పెళ్లి ప్రతిపాదన వచ్చింది. అయితే అతడు ఆమె కన్నా 30 ఏళ్లు పెద్ద వాడు కావడం గమానార్హం. 55 ఏళ్ల బల్లు అలియాస్ బలరామ్ నుంచి ఈ ప్రతిపాదన వచ్చింది. భవిష్యత్తులో బలరామ్ తమ కూతురు ఎలా చూసుకుంటాడన్న అనుమానం ఉన్నప్పటికీ.. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఏమీ పాలుపోక తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించారు. ఈ పెళ్లికి వినీత కూడా ఒప్పుకోవడంతో అన్ని లాంఛనాలతో కుటుంబ సభ్యులు 25 ఏళ్ల ఆమెకు .. 55 ఏళ్ల బలరామ్‌తో వివాహం జరిపించారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 55 ఏళ్ల వ్యక్తి యువతిని పెళ్లి చేసుకోవడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేయగా, మరికొందరు వికలాంగురాలికి అండగా నిలిచారంటూ అతన్ని కొనియాడుతున్నారు.