Viral Video: ‘‘ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడలేవు.. ఒకే చోట రెండు కొప్పులు ఉండలేవు’’ అన్న నానుడి మీకు తెలిసే ఉంటుంది. ఓ ఇద్దరు ఆడవాళ్లు ఒకే చోట ఉంటే గొడవలు పడతారన్న ఉద్దేశ్యంలో ఆ మాటన్నారు పెద్దలు. ఆ మాటను నిజం చేసే సంఘటనలు నిత్యం ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, కూడా ఓ సంఘటన జరిగింది. ఓ ఇద్దరు యువతులు నడిరోడ్డుపై ఒకరిని ఒకరు చావకొట్టుకున్నారు. పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఇద్దరి మధ్యా ఎందుకు గొడవ మొదలైందో తెలియదు కానీ, ఆ ఇద్దరు యువతులు రాత్రి అని కూడా చూడకుండా గొడవకు దిగారు. రెడ్ డ్రెస్‌లో ఉండే యువతి, బ్లాక్ డ్రెస్‌లో ఉండే యువతి జుట్లు పట్టుకుని కొట్టుకోవటం మొదలుపెట్టారు. రోడ్డుపై వాహనాలు వెళుతున్నా.. పక్కనే ఉన్న జనం వాళ్లను వింతగా చూస్తున్నా వాళ్లు పట్టించుకోలేదు.
ముఖంపై.. వీపుపై దారుణంగా కొట్టుకోసాగారు. తీవ్రమైన పోటాపోటీ తర్వాత రెడ్ డ్రెస్‌లో ఉన్న యువతి బ్లాక్ డ్రెస్‌లో ఉన్న యువతిపై.. పై చేయి సాధించింది. బ్లాక్ డ్రెస్ యువతిని చితక్కొట్టింది. అయితే, వీరిలో విన్నర్ ఎవరో తెలియకుండానే వీడియో ఎండ్ అయిపోయింది. ప్రస్తుతం ఈ భీకర యుద్ధానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లక్షల్లో వ్యూస్.. వేల సంఖ్యలో లైక్స్ సంపాదించింది. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘నిజంగా డబ్ల్యూడబ్ల్యూఈ చూస్తున్నట్లు అనిపించింది’’.. ‘‘ ఆడవాళ్లు ఎందులోనూ తక్కువ కాదు’’.. ‘‘ ఈ ఇద్దర్నీ రెస్లింగ్ పోటీలకు పంపించాలి. దేశానికి పతకం తెస్తారు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.