కరోనా కారణంగా విదేశాలలో ఎలాంటి పరిస్థితి ఉన్నా జరిమానాల పరంగా విదేశాలతో పోల్చితే ఇండియానే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే.. మాస్కులు ధరించకపోయినా, సామాజిక దూరం పాటించకపోయినా.. అసలు రూల్స్ ని ఖాతరు చేయకపోయినా పెద్దగా బాధపడే రేంజిలో ఫైన్స్ పడవు, ఆ స్థాయిలో పోలీసుల చర్యలు ఉండవు. కానీ విదేశాలలో ఇవేం చెల్లవు. అక్కడ మాస్క్ అనేది శాసనంగా మారింది.
పొరపాటున మాస్క్ తీసినా వెంటనే ఫైన్ పడిన సందేశం మొబైల్ కి వచ్చేస్తుంది. తర్వాత ఫైన్ పడిందని ఎంత బాధపడినా లాభం లేదు. తాజాగా బ్రిటన్ లో సెకను సెకనుకి కూడా ఫైన్ కౌంట్ అంటున్నారట అక్కడి పోలీస్ సిబ్బంది. ఓ షాపింగ్ మాల్ లో మాస్క్ తీసినందుకు క్రిస్టోఫర్ ఓ తూలే అనే వ్యక్తికి రూ. 2 లక్షల జరిమానా పడిందని తలబాదుకుంటున్నాడు.
అసలు విషయానికి వస్తే.. ప్రెస్కాట్ ఏరియాలో ఉన్న B&M షాపింగ్ మాల్ కి క్రిస్టోఫర్ మాస్క్ పెట్టుకొని వెళ్ళాడట. మాస్క్ అనేది ఎంతసేపు పెట్టుకుంటాం.. అసౌకర్యంగా ఉందని మాస్క్ తీశాడట. అలా మాస్క్ తీసాడో లేదో.. వెంటనే పోలీసులు ప్రత్యక్షమై 10వేలు ఫైన్ వేసి కేసు నమోదుచేసి వెళ్లిపోయారు. తర్వాత ఆ ఫైన్ మెయిల్ లో వచ్చిందట. ఆ ఫైన్ కట్టకుండా క్రిస్టోఫర్ అసలేం జరిగిందనే వివరణ ఇస్తూ రిటర్న్ మెయిల్ పంపాడు.
Bloke fuming over £2k fine after taking face mask off in shop ‘for 16 seconds’https://t.co/9lSyyXN5v4 pic.twitter.com/rxt5YwLqFB
— Daily Star (@dailystar) January 31, 2022
2021 ఫిబ్రవరిలో విధించిన ఫైన్.. క్రిస్టోఫర్ ఇంకా చెల్లించకపోవడంతో డిసెంబర్ లో మళ్లీ మెయిల్ వచ్చింది. కానీ ఈసారి 10వేల రూపాయల ఫైన్ సమయానికి చెల్లించలేదు కాబట్టి.. పూర్తిగా రూ.2 లక్షలు చెల్లించాల్సిందిగా ఆ మెయిల్ లో ఉంది. ఆ మెయిల్ చూసాక క్రిస్టోఫర్ కి చచ్చినంత పనైంది. ఇక త్వరలోనే పోలీసులు క్రిస్టోఫర్ ని కోర్టులో అప్పగిస్తారట. అక్కడే క్రిస్టోఫర్ రూ. 2 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంది. మరి మాస్క్ తీస్తే లక్షల ఫైన్ ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.