ప్రేమ గురించి ఎంత చెప్పినా ఓ మాట మిగిలే ఉంటుంది. ప్రేమకు సరి హద్దులు ఉండవు.. కులాలు, మతాలు అడ్డురావు.. వయసు తేడా ఉండదు. ఇందుకు మన సమాజంలో చాలా ప్రత్యక్ష ఉదాహరణలు ఉన్నాయి. ఇండియాకు చెందిన అబ్బాయి, వేరే దేశం అమ్మాయిని పెళ్లి చేసుకోవటం.. 60 ఏళ్ల వృద్ధురాలిని 20 ఏళ్ల యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకోవటం వంటి ఘటనలు తరచుగా వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా, ఓ 18 ఏళ్ల యువకుడు, ఓ 30 ఏళ్ల యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తొలి చూపులోనే ఆమె ప్రేమలో పడిపోయిన ఆ యువకుడు పెద్దల ఒప్పించి మరీ ఆమెను తనదాన్ని చేసుకున్నాడు. ఈ సంఘటన పాకిస్తాన్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్‌కు చెందిన ఆదిల్ అనే 18 ఏళ్ల కుర్రాడు తను ఉండే ప్రాంతానికి చెందిన ఓ 30 ఏళ్ల యువతిని ప్రేమించాడు.
తొలి చూపులోనే అతడికి ఆమె మీద ప్రేమ పుట్టింది. ఈ విషయాన్ని ఆమెకు నేరుగా చెప్పలేకపోయాడు. తను చేసే పనుల ద్వారా ఇష్టాన్ని తెలియజేసేవాడు. ఆదిల్, ఫాతిమా ఇంటికి తరచుగా కొన్ని సరుకులు తీసుకువెళ్లేవాడు. ఆ సమయంలోనే వస్తువులతో పాటు కొన్ని గులాబీ పూలను కూడా ఆమె ఇంటి ముందు ఉంచేవాడు. ప్రతీ రోజూ ఇలా చేస్తూ ఉండేవాడు. దీంతో ఆమెకు ఏమీ అర్థం అయ్యేది కాదు. అతడు ఎందుకలా చేస్తున్నాడా? అని ఆలోచిస్తూ ఉండేది. ఓ సారి ఈ గులాబీ పూల గురించి అతడ్ని అడిగింది. ‘‘ ఫాతిమా గారు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను’’ అని అన్నాడు.
అతడలా చెప్పగానే ఆమె షాక్ అయింది. అరే ఏంట్రా ఇది.. ఇంత చిన్న పిల్లోడు నన్ను ప్రేమించటం ఏంటి అనుకుంది. ఇక, అప్పటినుంచి అతడి ఆలోచన్లో పడిపోయింది. ఆదిల్ ఆమెకు ఆలోచించే అవకాశం కూడా ఇవ్వలేదు. తన తండ్రికి తన ప్రేమ గురించి చెప్పాడు. ఫాతిమాతో పెళ్లి చేయమని ప్రతి రోజూ టార్చర్ చేసేవాడు. ఆదిల్ పోరు భరించలేక ఫాతిమాతో పెళ్లికి ఆయన ఒకే చెప్పాడు. స్వయంగా ఫాతిమా ఇంటికి వెళ్లి పిల్లను అడిగాడు. మొదట్లో ఫాతిమా తల్లిదండ్రులు ఆలోచించారు. తర్వాత ఫాతిమా కూడా ఈ పెళ్లికి సరేననటంతో ఇద్దరికీ ఘనంగా పెళ్లి చేశారు. ప్రస్తుతం వీరి ప్రేమ కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఆదిల్.. ఫాతిమాల ప్రేమ, పెళ్లి కథపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.