పైన ఫొటోలో కనిపిస్తున్న ఈ భారీ చేప పేరు ముక్కుడు టేపు చేప. ఇది అరుదైన జాతికి చెందినది. దీనిని ఎక్కువగా ఔషద తయారీలో మాత్రమే వాడతారట. అసలు దీని విలువ ఎంతో తెలిస్తే మీరు నోరెళ్లబెట్టడం ఖాయం.
సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఓ అరుదైన చేప చిక్కింది. ఈ భారీ చేపను చూసి మొదట్లో మత్స్యకారులు సైతం భయపడ్డారు. ఇక ఆ తర్వాత ఇది ఓ అరుదైన జాతికి చేప అని తెలుసుకుని అందరూ సంతోపడ్డారు. ఆ చేప ఏకంగా 1500 కిలోలు ఉండడం విశేషం. ఈ భారీ చేపను చూసేందుకు చుట్టు పక్కల ప్రాంతాల వచ్చి ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఇక ఈ భారీ చేప విలువ తెలుసుకుని స్థానికులు అంతా నోరెళ్లబెట్టారు. అసలు ఈ భారీ చేప విలువ ఎంతో తెలుసుకోవాలనుందా?
అది ఏపీలోని అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం బంగారమ్మ పాలెం గ్రామం. ఇదే ప్రాంతానికి చెందిన కారే దుబెన్ అనే మత్స్యకారుల బృందం ఇటీవల సముద్రంలో వేటకు వెళ్లింది. అయితే సముద్రంలో వల వేయగా.. వీరికి అరుదైన జాతికి చెందిన ముక్కుడు టేకు చేప వీరి వలకు చిక్కుకుంది. ఆ భారీ చేపను చూసిన ఆ మత్స్యకారులు మొదట్లో ఏంటోనని భయపడ్డారు. ఆ తర్వాత ఇది ఓ అరుదైన జాతికి చెందిన చేప అని తెలుసుకుని ఆనందపడ్డారు. అనంతరం ఆ మత్స్యకారులంతా కష్టపడి చివరికి ఆ భారీ చేపను ఒడ్డుకు చేర్చారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు వచ్చి ఆసక్తిగా తిలకించారు. ఈ భారీ చేపను ఔషద తయారీలో ఎక్కువగా వాడతారని, దీని విలువ సుమారుగా రూ. 3 లక్షల వరకు ఉంటుందని కొందరు మత్స్యకారులు తెలిపారు.