ప్రస్తుత కాలంలో ఎవరినైనా రూపాయికి ఏమి వస్తుందని అడిగితే.. ఏం వస్తుంది బిచ్చగాడికి వేస్తే పుణ్యం వస్తుందని అంటారు. భిక్షాటనం వారు కూడా రూపాయి ఇస్తే ఎగాదిగా చూస్తారు. కానీ.. అనంతపురం జిల్లా తాడిపత్రి వాసులను రూపాయి కి ఏమి వస్తుందని అడిగితే మాత్రం తడుముకోకుండా సావిత్రమ్మ దోశ అని చెబుతారు. అవును సావిత్రమ్మ దోశ అంటే తాడిపత్రిలో అంత ఫేమస్ మరి. ఆ ప్రాంతంలో అవ్వ దోశలు అంటే తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. సావిత్రమ్మ రూపాయికే దోశ ఇస్తూ..ఎంతో మంది ఆకలి తీరుస్తుంది. వారికి ఆమె అన్నపూర్ణదేవిలా కనిపిస్తోంది.
ఈ కాలంలో మనం టిఫిన్ సెంటర్ కు వెళ్లి దోశ తీసుకుంటే తక్కువలో తక్కువ రూ.20 ఉంటుంది. ముడిసరకుల రేటు పెరిగితే వాటి ధర కూడా పెరుగుతుంది. కానీ.., అవ్వ మాత్రం కాలం మారిన తన దోశ రేటు ను మార్చలేదు. సావిత్రమ్మ టిఫిన్ సెంటర్ పెట్టిన కొత్తలో పావలాకు దోశ అమ్మేది. ఆ తరువాత అర్ధ రూపాయి కి అమ్మింది. చివరకి దోశను రూపాయి అమ్ముతోంది. బియ్యం రేటు, నూనె రేటు పెరిగినా.. దోశ రేటు మాత్రం పెంచలేదు సావిత్రమ్మ.
“ఎంతో మంది ఆకలితో ఇక్కడి వస్తుంటారు. వారు రూపాయికే దోశ లభించటంతో వారు ఎక్కువ దోశలు తినేవారు. వారి ఆకలిని చూసిన నాకు దోశల రేటు పెంచకుడదని నిర్ణయించుకున్నా. నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు రూపాయికే దోశ అందిస్తాను” అని సావిత్రమ్మ తెలిపారు. ఆమెకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. రూపాయికి దోశ అమ్మటంతో వచ్చిన డబ్బులతోనే ఇద్దరు ఆడ పిల్లలకు పెళ్లిలు చేసింది. మనమళ్లు మనవరాలతో సంతోషంగా ఉంది.
సావిత్రం కొడుకు మాట్లాడుతూ.. మేము సంపాదిస్తాములే..నీవు తగ్గిపోయావు కదా ఇకా ఈ పని అపేయి అమ్మా అంటే.. నా ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు ఇక్కడి వారికి రూపాయి దోశ వేసి వారి ఆకలి తీరుస్తుంటానని ఆమె చెప్పిందని తెలిపాడు. సావిత్రమ్మ వేసే దోశలు రుచిగా ఉంటాయని, 20/- ఇస్తే కడుపు నిండా దోశాలు తిన్నొచ్చని స్థానికులు తెలిపారు. ఆహారాన్ని కూడా వ్యాపారం చేసే ఈ రోజుల్లో రూపాయికే దోశ ఇస్తున్న సావిత్రమ్మ అన్నపూర్ణదేవి అంటూ అక్కడి వారు అమెను అభినందిస్తున్నారు. ఇలా కడుపు నిండా దోశలు పెడుతూ..అందరి ఆకలి తీరుస్తున్న ఈ సావిత్రమ్మ ఎందరికో ఆదర్శం. ఈ విధంగా సావిత్రమ్మ అక్కడి స్థానికులకు ఆకలి తీర్చడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.