సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో నెటిజన్లను షాక్ కి గురిచేస్తోంది. పెళ్లిలో ముద్దు పెట్టుకోవడం.. అనేది క్రైస్తవులకు సాధారణ సంప్రదాయం అని తెలిసిందే. కానీ, హిందూ వివాహాల్లో వధూవరుల ముద్దు సీన్ అనేది ఆశ్చర్యపరిచే విషయం. అయితే.. తాజాగా వధూవరులు పెళ్లి పీటల మీద ముద్దు పెట్టుకున్న వీడియో ఒకటి ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది.
ఈ పెళ్లి ఎక్కడ జరిగిందో వివరాలు బయటికి రాలేదు. పెళ్లి మండపంలో బంధువులు, జనాలు ఉన్నా కూడా వీరిద్దరూ ముద్దు పెట్టుకోవడం ఆపకపోవడం గమనార్హం. మీరు కూడా ఈ వీడియో పై ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి.