సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు మనకు ప్రత్యక్షం అవుతుంటాయి. వీటిలో కొన్ని నవ్వు తెపిస్తుంటే… మరికొన్ని ఆశ్చర్యం, ఇంకొన్ని వెన్నులో వణుకు పుట్టిస్తాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెటింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత మీరు కూడా ఒక్క క్షణం భయపడక మానరు. పాముని అకస్మాత్తుగా చూస్తే ఒళ్లు జలధరిస్తుంది. ఎక్కడో తెలియని భయం కూడా వెంటాడుతుంది. అలాంటి ఓ పాము ఎలుకను తింటుంది. ఇది సాధారణమే కానీ ఆ పాము ఒకేసారి రెండు ఎలుకలను తింటోంది.
రెండు తలల పాము టైరు మధ్యలో తిష్టవేసి రెండు ఎలుకులను తినడానికి తెగ ప్రయత్నిస్తోంది. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే.. పాము ఏకకాలంలో రెండు నోళ్లతో ఎలుక పిల్లలను వేటాడుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఈ వీడియో చూసేయండి.. దీనిపై మీ అభిప్రాయాను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.