సామాన్యంగా స్టేజిలపై సెలబ్రిటీలు డాన్స్ చేయడం రోజూ చూస్తూనే ఉంటాం. కానీ ప్రభుత్వ అధికారులు వారి డ్యూటీ అనంతరం సేదతీరుతూ.. స్టేజిపై స్టెప్పులేయడం అనేది కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. సినిమా వాళ్ళ డాన్స్ ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. అదే అరుదుగా కనిపించే అధికారుల డాన్స్ చూస్తే మాత్రం ఆ కిక్కే వేరు. వృత్తి విషయం పక్కన పెడితే.. ప్రభుత్వ అధికారులకు కూడా ప్రైవేట్ లైఫ్ ఉంటుంది.
పబ్లిక్ ఇష్యూస్ కారణంగా వాళ్ళు పెద్దగా సెలెబ్రేషన్స్ లో పాల్గొనరు. ఎంజాయ్ చేసేందుకు కూడా ఆసక్తి చూపించరు. కానీ తాజాగా ఓ ప్రభుత్వ రెవెన్యూ అధికారి ఎంజాయ్ చేసిన విధానం చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే.. న్యూ ఇయర్ వేడుకలలో ఈ తహశీల్దార్ డాన్స్ అదరగొట్టి సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తున్నాడు. అది ఎక్కడో కాదు.. ఖమ్మం జిల్లా, కల్లూరు తహశీల్దార్ మంగీలాల్.. ఇటీవలే తన స్నేహితులతో కలిసి న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ లో పాల్గొన్నాడు. ఇక పార్టీ మూడ్ లో మెగాస్టార్ చిరంజీవి డాన్స్ నెంబర్ ‘గోలీమార్’ పాటకు స్టేజి ఎక్కి స్టెప్పులతో దుమ్మురేపాడు.