ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది. ప్రపంచానికి తెలియని ఎన్నో టాలెంట్స్ ఇంటర్నెట్ వేదికగా అబ్బురపరుస్తున్నాయి. నెట్టింట్లో కనిపించే చాలా వీడియోలు అందరిని తెగ ఆకట్టుకుంటాయి. తాజాగా మామిడి పండుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఈ వీడియోకి లక్షల్లో లైక్ లు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు. అయితే పండు ఏమిటి? అంత గా ఆకర్షించడం ఏమిటనే కదా! మీ సందేహం. అది మాములు మామిడి పండు కాదు.. జీప్ కలిగిన పండు. మన బ్యాగ్స్ కు ఉన్నట్లే ఆ మామిడి పండుకు జీప్ అమర్చారు. ఇది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియా ఫుల్ వైరల్ అవుతోంది.
సాధారణంగా మనం జిప్ అనే దానిని బట్టలు, పర్సులు, బ్యాగులకు ఉండటం చూస్తుంటాము. అయితే కొందరు మరికొన్ని వస్తువులకు వేరైటిగా జిప్ ను ఏర్పాటు చేస్తుంటారు. కానీ ఎవరికైనా పండ్లకు జిప్ పెట్టాలనే ఆలోచన వస్తుందా? సాధారణంగా ఎవరికి రాదు.. కానీ ఓ వ్యక్తికి ఆ ఆలోచన వచ్చింది. అంతే ఓ పెద్ద మామిడి పండును మధ్యలో చిన్నగా కట్ చేసి జిప్ ను ఏర్పాటు చేశాడు. అతడు చేసిన ఈ వింత ఆలోచనకి అందరు అవాక్కయ్యారు. జిప్ కలిగిన మామిడి పండుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కొందరు ఇది నిజమైన పండా! లేకా ప్లాస్టిక్ పండా అనే సందేహం కలిగింది. కానీ జాగ్రత్తగా చూస్తే అది నిజమైన మామిడి పండే. ఇప్పుడు ఈ జిప్ మామిడి పండు నెటిజన్లను బాగా ఆకట్టుకుంది.
ఇదీ చదవండి: గుక్కెడు నీళ్ల కోసం ప్రాణాలకు తెగిస్తున్న మహిళలు! ఇంత కష్టం ఎక్కడంటే?
ఈ వీడియో నెటిజన్లకు బాగా నచ్చడానికి కారణం ఇందులోని క్రియేటివిటి. మామిడి పండుకు జిప్ చాలా చక్కగా సెట్ చెయ్యడం. పండు ఏమాత్రం పాడవ్వకుండా చేసిన ఈ పని అందరి ఆశ్చర్యాన్ని కలిగించింది. “మీ టాలెంట్ కి జోహర్లు, ఇలాంటి ఆలోచనలు ఇంక ఏమైనా ఉన్నాయా? మీరు మీ బ్రెయిన్ ని ఇలా కూడా ఉపయోగిస్తారా?” అంటూ చాలా మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఓ లుక్కేసి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.