సమాజంలో పోలీస్ డిపార్ట్మంట్ పై జనాలకు మంచి రెస్పెక్ట్ ఉంది. వారిలో కొందరు ఫ్రెండ్లీ పోలీసింగ్ తో జనాలకు దగ్గరవుతుంటారు. మరికొందరు తమ అధికార దుర్వినియోగంతో వార్తల్లో నిలుస్తుంటారు. పోలీసుల రక్షణ ఉందనే జనాలు ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. కానీ అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు పోలీస్ వారిపై మచ్చ పడేలా చేస్తుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ పోలీస్ అధికారిని గ్రామస్థులు నిలదీసిన వీడియో వైరల్ గా మారింది.
తెలుగు రాష్ట్రాలలో ఎక్కడో మూల జరిగిన ఈ సంఘటన జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తిని తప్పులేకండా పోలీస్ అధికారి చేయి చేసుకున్నాడని.. ఆ వ్యక్తి గ్రామస్థులతో కలిసి పోలీస్ అధికారిని నిలదీయడం మనం చూడవచ్చు. సామాన్యులపై తమ అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటే రియాక్షన్ ఎలా ఉంటుంది? అనేది వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోను మీరు కూడా చూసి అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.