ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం అన్నాడు ఓ సినీ కవి. ఆయన ఏ సందర్భంలో అన్నాడో గాని.. ఇక్కడ ఓ అమ్మాయి మాత్రం.. తనని ప్రేమించిన వాడిని అంతే కఠినంగా శిక్షించింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
మనం కొన్ని కొన్ని సందర్భాల్లో రోడ్డు మీద వెళ్తుంటే.. కొంత మంది పరాచకాలు ఆడుతుంటారు. ఐతే ఆ పరాచకాలు తెలిసిన వారు ఆడితే పర్లేదు కానీ, ముక్కు, మెుహం తెలియని వారైతే.. ఇంకేముంది! అక్కడ పెద్ద రణరంగమే జరుగుతుంది. ఇలాంటి రణరంగమే తాజాగా రాజస్థాన్ లో జరిగింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. స్కూటీ పై వెళ్తున్న ఓ యువతికి, ఎదురుగా వస్తున్న ఓ వ్యక్తి స్కూటీ ఆపి మరి ఆమెకు ప్రపోజ్ చేశాడు. వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్ లోని జోధ్ పుర్ కు చెందిన ఓ యువతి తన స్కూటి పై పని మీద ఎటో వెళ్తోంది. ఈ క్రమంలోనే సదరు యువతి స్కూటీకి ఎదురొచ్చిన ఓ ప్రబుద్ధుడు.. ఆమెను ఆపాడు. స్కూటీని ఆపడంతో చిర్రెత్తుకొచ్చిన ఆమె.. అతడిని చెడా మడా తిట్టింది. యువతి తిడుతుండగానే ఆ వ్యక్తి ఆమెకు ఉన్నపలంగా ఐ లవ్ యూ అని చెప్పాడు. ఇక అంతే సంగతులు ఆ మహిళ భద్రకాళిలా మారి వాడి అంతు చూసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. “ఈ వయసులో నికెందుకు సామీ ఈ లవ్వులు.. గివ్వులు” అందరు ఆడాళ్లు ఒకేలా ఉండరు.. తాట తీస్తారు” అంటూ కొందరు నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు.