ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 ఏళ్ల నుంచి ఓ వ్యక్తి పచ్చి మాంసాన్ని మాత్రమే తింటున్నాడు. ఆ విషయం తన భార్యకు కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ ఒక రోజు పచ్చిమాంసం తింటున్న విషయం భార్యకు తెలిసింది. దీంతో ఆమె షాక్‌కు గురైంది. తన భర్తకు ఈ వింత అలవాటు ఎలా అబ్బింది? దాన్ని ఎలా మాన్పించాలని సతమతమైంది. ఈ విషయాన్ని పూస గుచ్చినట్లు సోషల్ మీడియాలో పంచుకుంది. తన భర్తకు పచ్చి మాంసం తినే అలవాటు ఉంది. దాన్ని ఎలా మాన్పించాలో కాస్తా సలహా ఇవ్వండి అంటూ నెటిజన్లను కోరింది. ప్రస్తుతం ఈ వ్యవహారం నెట్టింట్లో రచ్చ చేస్తోంది. ఇంగ్లండ్ లింకన్‌షైర్‌లోని బోస్టన్ నివాసి అయిన పీటర్ రిచర్డ్‌సన్ ఇంట్లో నాన్‌వెజ్ వండినప్పుడు అసలు భోజనమే చేసేవాడు కాదు. దాంతో అతని భార్య కేటీ చామర్స్ భర్త శాఖాహారి అని భావించింది.
కానీ, ఆ తరువాత అతని అభిరుచి తెలిసి ఒక్కసారిగా షాక్ అయ్యింది. తన భర్తకు పచ్చి మాంసం తినడం ఇష్టం అని, 50 ఏళ్లుగా పచ్చి మాంసాన్ని తింటున్నాడని తెలుసుకున్న ఆమెకు మైండ్ బ్లాంక్ అయ్యింది. మనుషులు ఇలా కూడా ఉంటారా? అని కాసేపు నిశ్చేష్టురాలైంది. భర్త వింత అలవాటు గురించి చామర్స్ ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. పీటర్ తన వింత అలవాటుకు ఒక కారణం చెప్పాడు. తాను చిన్నప్పుడు ఏదో తప్పు చేస్తే.. శిక్షగా తన తల్లి పచ్చిమాంసం తినిపించిందని చెప్పాడు. ఆ సమయంలో పచ్చి మాంసం రుచిగా అనిపిపంచడం.. అలా అలా అది కంటిన్యూ అయ్యిందని వివరించాడు. ఇదే విషయాన్ని నెటిజన్లకు చామర్స్ వివరించింది.
ఇదీ చదవండి: పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు భారీ షాక్.. వారంలో వాళ్లు తిన్న బిర్యానీ బిల్లు రూ.27 లక్షలు