ఏడ్చే మగాడ్ని, నవ్వే ఆడదాన్ని అస్సలు నమ్మకూడదని అంటారు. మగాడు ఎప్పుడూ ఏడవడు కాబట్టి, ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు కాబట్టి ఏడిస్తే నమ్మొద్దన్నారు. అలానే అమ్మాయి ఎప్పుడూ ఏడుస్తూ ఉంటుంది కాబట్టి నవ్వితే అనుమానించమన్నారు. ఆడవాళ్లు మగాళ్లతో పోలిస్తే ఎక్కువగా ఏడుస్తుంటారు. వాళ్లని ఏమైనా అంటే వెంటనే హర్ట్ అయిపోతారు. వెంటనే కళ్ళలో ఉన్న గంగ బయటకొచ్చేస్తుంది. మీరు గమనించే ఉంటారు, ఎవరైనా చనిపోయినప్పుడు కూడా.. సొంత మనుషుల కంటే ఈ మహిళా జిరాక్స్ లే ఎక్కువగా ఏడుస్తారు. ఆస్కార్ ఇచ్చినా తక్కువేమో ఈ పెర్ఫార్మెన్స్ కి అనేలా ఏడుస్తారు.
నిజంగా వాళ్ళు ఏడుస్తారో లేక ఏడవకపోతే బాగోదు అని ఏడుస్తారో అర్థం కాదు కానీ మగాళ్ల కంటే ఆడవాళ్లే ఎక్కువగా ఏడుస్తారు. నిజంగా ఆడవాళ్లు మరీ అంత సున్నితమా? నిజంగా ఆడవాళ్లు మెతకేనంటారా? గంభీరంగా కనిపించే ఆడవాళ్లు కూడా ఏదైనా చిన్న సమస్య వస్తే ఏడ్చేస్తారు. అంటే దీని వెనుక ఏదైనా కారణం ఉందా? సైన్స్ ఏమైనా ఉందా? ఆ ముచ్చటేంటో చూద్దాం. ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరగ్గానే ఆడవాళ్లు వల వల ఏడ్చేస్తారు అంటే దానికొక సైంటిఫిక్ రీజన్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దశాబ్దాలుగా పరిశోధనలు, అధ్యయనాలు చేయగా తేలింది ఏంటంటే.. ఆడవాళ్లే మగాళ్ల కంటే ఎక్కువ ఏడుస్తారట.
1980ల్లో బయోకెమిస్ట్ విలియం హెచ్. ఫ్రెయ్, పీహెచ్డీ చేసిన మహానుభావుడు కనుగొన్నది ఏంటంటే.. నెలలో ఆడవాళ్లు సగటున 5 సార్లు ఏడిస్తే.. మగాళ్లు కేవలం ఒకసారి ఏడుస్తారంట. అది కూడా హై కేసెస్ లో. అయితే అది కంటతడి పెట్టుకోవడం అవ్వచ్చు, వల వల ఏడవడం అవ్వచ్చు అని ఆయన కనుగొన్నారు. ఈయన చెప్పింది ఈ మధ్య కాలంలో చేసిన అధ్యయనాల్లో కూడా నిజమని తేలింది. లారెన్ బిల్స్మా పీహెచ్డీ క్యాండిడేట్ కూడా తాను చేసిన పరిశోధనలో మగాళ్ల కంటే అమ్మాయిలే ఎక్కువగా ఏడుస్తారని చెప్పారు. అయితే జీవశాస్త్రపరంగా మహిళలు ఎక్కువగా ఏడవడానికి కారణం ఉంది. ఆడవాళ్ళలో ఉండే టెస్టోస్టెరోన్ ఏడుపుని నిరోధిస్తుంది. అయితే హార్మోన్ ప్రోలక్టిన్ అధిక స్థాయిలో ఉంటే గనుక అది ఏడుపుని పనిగట్టుకుని ప్రమోట్ చేస్తుందట.
అందుకే ఆడవాళ్లు ఎక్కువగా ఏడుస్తారని పరిశోధనలు చెబుతున్నాయి. కానీ ఏడవాలన్న కోరిక వారికి సహజంగా ఉండదంట. ప్రపంచంలోని పేద దేశాలు, అగ్ర దేశాలు కలిపి 35 దేశాల్లో ఆడవాళ్ళ మీద పరిశోధనలు జరిపితే.. ఆ దేశాల్లో మహిళలకి ఏడుపు అనేది మగాళ్లతో పోలిస్తే ఎక్కువగా వస్తుందని తేలింది. వాళ్ళు ఎక్కువగా ఎమోషన్ అవ్వడమే దానికి కారణమని పరిశోధకులు చెబుతున్నారు. ఏడుపు గొట్టు తనం ఎక్కడైనా ఒకటే. ఏడుపుకి స్వదేశం, విదేశం అని తేడా ఏం ఉండదు. ఆడవాళ్లు అక్కడున్నా, ఇక్కడున్నా, ఎక్కడున్నా ఏడుపు అనేది సహజం. అది వారి హార్మోన్ సమస్య వల్ల వచ్చేది. అదండీ విషయం. మగాళ్లతో పోలిస్తే ఆడవాళ్లు ఎక్కువగా ఏడవడం వెనుక ఉన్న సైన్స్. దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.