పాములు తన చర్మాన్ని విడిచి పెడుతుంటాయి. ఇలా ఎందుకు చేస్తాయో మీకు తెలుసా?
పాము అంటే చాలా మందికి భయం. చూడ్డానికి కూడా అసహ్యం కలిగించేలా ఉంటుంది. 2022 గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 3,971 పాముల జాతులు ఉన్నాయి. వీటిలో 600 జాతుల పాములు విషపూరితమైనవి. ఇందులో 200 జాతుల పాములు మనిషిని చంపేయగలవు. భారత్ లో ఐతే 300 రకాల జాతులు ఉన్నాయి. ఇందులో 60 కంటే ఎక్కువ జాతులు విషపూరితమైనవి ఐతే.. 40 కంటే ఎక్కువ జాతులు స్వల్ప విషపూరితమైనవి. 180 జాతులు మాత్రం విషపూరితమైనవి కావు. జస్ట్ షోయింగ్ తప్ప లోపల మేటర్ ఏం ఉండదు. అయినా సరే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టి చావాలని అంటారు. ఆ సంగతి పక్కన పెడితే.. పాములు చర్మాన్ని విడిచి పెడుతుంటాయి.
మీరు ఏ జంతువులకు సంబంధించిన ఛానలో చూస్తే కనబడుతుంది. అసలు పాములు చర్మాన్ని ఎందుకు విడిచి పెడతాయో అని ఎప్పుడైనా గమనించారా? పాములు మరియు ఇతర జంతువులు తమ చర్మపు పొరను వదులుతుంటాయి. ఈ ప్రక్రియను ఎక్డైసిస్ అంటారు. ఈ ప్రక్రియ ఏడాదిలో 4 నుంచి 12 సార్లు జరుగుతుంది. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది.. పాము శరీరం అనేది కంటిన్యూగా పెరుగుతుంది. కానీ చర్మం మాత్రం పెరగదు. మనిషి ఎదుగుతుంటే బట్టలు కురచ అయిపోయినట్టు.. పాము ఎదుగుతుంటే దాని చర్మపు పొర చిన్నదైపోతుంది. అందుకే ఆ చర్మపు పొరను విడిచిపెడతాయి. ఆ తర్వాత విశాలమైన చర్మపు పొర ఏర్పడుతుంది.
మరొక కారణం ఏంటంటే.. ఆ చర్మం మీద ఏమైనా హానికరమైన జీవులు ఏమైనా ఉంటే పోతాయి. ఐతే ఈ ప్రక్రియ జరిగినప్పుడు పాము చర్మం నీలం రంగులోకి మారిపోతుంది. ఆ సమయంలో పాము కంటి చూపు అనేది మందగిస్తుంది. రాయి లాంటి గరుకు ప్రదేశం మీద పాము తన శరీరాన్ని రాపిడి చేస్తూ బాహ్య చర్మాన్ని విడిచి పెడుతుంది. ఇలా చేస్తున్నప్పుడు పాముకు ఎలాంటి గాయాలు అవ్వవు. పాము పరిమాణం, శరీర స్థితి, వాతావరణం బట్టి ఈ ప్రక్రియ అనేది రోజుల నుంచి వారాల వరకూ జరుగుతుంది. ముసలి వయసు వచ్చే వరకూ ఈ ప్రక్రియ అనేది పాముల్లో సర్వసాధారణం. అయితే వయసులో ఉన్నప్పుడు కంటే ముసలి వయసులో ఈ ప్రక్రియ తక్కువ జరుగుతుంది. పాము తన చర్మాన్ని విడవడం అంటే.. ఒక చిన్న పిల్లాడు ఒక గుంటను ఒలిచిన దాంతో సమానం