SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » unknown facts » Why Mother In Law And Daughter In Law Fight With Each Other

ఊరికే అత్తా కోడలు ఎందుకు గొడవ పడతారు? దీని వెనుక సైకలాజికల్ కారణం ఉందా?

  • Written By: Nagarjuna
  • Published Date - Sat - 7 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఊరికే అత్తా కోడలు ఎందుకు గొడవ పడతారు? దీని వెనుక సైకలాజికల్ కారణం ఉందా?

అత్తా కోడళ్ళు అమ్మో ఇదో పెద్ద సబ్జెక్టు, అట్లాంటిక్ మహాసముద్రం కంటే పెద్దదని ఫీలవుతారు కొంతమంది. ఏ ఇంట్లో అయినా పొరపాటున కొడుకు పుట్టాడా ఇక ఈడి పని అయిపోయింది పాడు సమాజం ఆఫ్ ఇండియా నవ్వుకుంటుంది. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు ఉన్నా కూడా మేనేజ్ చేయవచ్చేమో కానీ ఒకే ఇంట్లో భార్య, తల్లి ఉంటే మేనేజ్ చేయడం కష్టమని అత్తా, కోడళ్ల కొట్లాటలో నలిగిపోయే కొడుక భర్తలు భావిస్తుంటారు. ఒక చిన్ని నవ్వే నవ్వి యుద్ధాలన్నీ ఆపచ్చు అంటారు. మరి అత్తాకోడళ్ల గొడవను ఒక చిన్ని నవ్వుతో ఆపచ్చు కదా. కానీ అలా ఎందుకు చేయరు. అంటే నవ్వితే ‘నవ్వకండి సీరియస్ మేటర్’ అని చెప్పి చెరో దవడ పళ్ళు రాలగొడతారని భయమేమో. కారణం ఏదైనా గానీ అత్తాకోడళ్ల గొడవలోకి మగాళ్లు వెళ్లే సాహసం చేయరని అందరికీ తెలిసిందే.   

అత్తా కోడళ్ళకు పడదు అన్న కాన్సెప్ట్ మీద కొన్ని వేల ఫ్రాంచైజీలు సీరియల్స్ రూపంలో, కామిక్స్, మీమ్స్ రూపంలో ఇప్పటికీ నడుస్తున్నాయి. అసలు అత్తా కోడళ్ళకి ఎందుకు పడదు అంటే ఉప్పు తక్కువైందని, పప్పు ఎక్కువైందని సిల్లీ రీజన్స్ చెప్తారు గానీ సైకలాజికల్ గా ఉన్న సమస్యలను సీరియస్ గా ఎవరూ బయటపెట్టరు. అసలు అత్తా, కోడళ్ల రిలేషన్ గురించి ఒక మహానుభావుడు ఏమన్నాడంటే.. ‘ది రిలేషన్ బిట్వీన్ అత్త అండ్ కోడలు మస్ట్ బి లైక్ ఏ రైస్ అండ్ రైస్ కుక్కర్, గ్యాస్ స్టవ్ అండ్ గ్యాస్ సిలిండర్, మ్యాచ్ బాక్స్ అండ్ మ్యాచ్ లా ఉండాలని అన్నాడు. నిత్యావసర సరుకులు, వంట సామాన్లలా కలిసి మెలిసి ఉండాలని, అత్తా కోడళ్ల బంధం పెనం మీద దోసలా పెనవేసుకోవాలని అంటారు. కానీ ఎంత అనుకున్నా దాదాపు చాలా ఇళ్లలో అత్తా కోడళ్ళు ఎడమొఖం, పెడమొఖం పెట్టుకుని ఉంటారని తెలిసిందే.       

Why don't aunts and daughters-in-law fall

అసలు ఇలా ఉండడానికి కారణం ఏంటి? కొన్ని అధ్యయనాలు చెబుతున్న దాని ప్రకారం వారికి సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉంటుందట. ముఖ్యంగా అత్త గారికి ఎక్కువగా ఉంటుందట. సాధారణంగానే మహిళలు కుటుంబం పట్ల పాజిటివ్ గా, సున్నితంగా ఉంటారు. మగాళ్లతో పోలిస్తే కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచించేది ఆడవాళ్లే. భర్త పొద్దున్న వెళ్లి సాయంత్రం వస్తాడు. ఈలోపు ఇంట్లో ఎన్ని చక్కబెట్టాలి. ఈ కారణంగా తల్లిగా, భార్యగా అన్నీ తానే అయ్యి ఇంటిని చూసుకుంటుంది. ఒక హోమ్ మినిస్టర్ లా తానే మొత్తం చక్కబెడుతుంది. ఎప్పుడైతే కోడలు వస్తుందో అప్పుడు మొత్తం మారిపోతుంది. అప్పటి వరకూ కొడుకు మీద చూపించిన ప్రేమ.. కోడలి ప్రేమ కంటే తక్కువేమో అన్న అభద్రతా భావంలోకి వెళ్ళిపోతుంది.

ఇన్నాళ్లు అనుభవించిన హోమ్ మినిస్టర్ పదవి కోడలి చేతిలోకి పోతుందేమో అన్న భయం వెంటాడుతుంది. పెత్తనం కోడలికి దక్కకూడదని.. కొడుకుని తన గుప్పిట్లోనే పెట్టుకోవాలని భావిస్తుంది. ఇన్నాళ్లూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన కుటుంబాన్ని కొత్త కోడలు ఏం చేస్తుందన్న భయం నుంచే సాధింపులు పుట్టుకొస్తాయట. ఆర్ధిక లావాదేవీల్లో కూడా కోడలు పెత్తనం చెలాయిస్తే అత్తగారికి ఇష్టముండదు. దుబారా చేస్తుందేమో అన్న భయం ఎక్కువగా ఉంటుందట. కొడుకు సంసారాన్ని నాశనం చేసేస్తుందేమో అన్న భయం వెంటాడుతుందట. కొడుకు తమతో సమయం గడపడం లేదన్న కోపం కూడా ఉంటుందట. అప్పటి వరకూ తమ మాట విని, తమతో అన్నీ షేర్ చేసుకునే కొడుకు.. పెళ్లయ్యాక భార్యతో షేర్ చేసుకోవడం కూడా ఆమెని బాధిస్తుందట. భార్యతోనే ఎక్కువ సమయం గడపడం, తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని అసూయతో కూడా కోడలిని కొడుకు ముందు బ్యాడ్ చేయాలని చూసే స్థితికి వెళ్తారట.

Why don't aunts and daughters-in-law fall

అప్పటి వరకూ కొడుకు తన మాట వినేవాడు.. పెళ్ళాం వచ్చాక వినడం లేదు అని బాధపడతారట. ఇంకో అసలైన కారణం ఏంటంటే.. చుట్టుపక్కల వాళ్లతో ఫ్రెండ్ షిప్. పక్కింట్లో ఉన్న అత్తగారితో ఈ ఇంటి కోడలు స్నేహం, ఈ ఇంట్లో ఉన్న అత్తగారితో పక్కింటి కోడలు స్నేహం. ఒకరి బలహీనతలు మరొకరికి షేర్ చేసుకుంటారు. అలా అది ఊరంతా పాకుతుంది. అది వాళ్లకు నచ్చదు. అసలు అత్తా, కోడళ్ళు ఇద్దరూ స్నేహంగా మాట్లాడుకుంటే ఏ గొడవలూ ఉండవు. కానీ పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని బాగా నమ్ముతారు. వాళ్లలో మంచి వాళ్ళు ఉంటే పోనిలే అండి, కూతురు వయసుదే కదా అని మంచి చెప్పే ప్రయత్నం చేస్తారు. అదే పచ్చని సంసారంలో నిప్పులు పోయాలని చూసే రకం అయితే.. కోడలి గురించి లేనిపోనివన్నీ కలిపి చెప్తారు. అత్తా, కోడళ్ల మధ్య ఇంకా గొడవలు పెంచుతారు. ఏదున్నా ఫేస్ టూ ఫేస్ తేల్చుకుంటే.. పరిష్కారం దొరుకుతుందని చెబుతున్నారు.

మరొక కారణం పొగడ్తలు. ఒకవేళ అత్త గారికి ఒక కూతురు ఉంటే.. ఆ కూతురు తన వంటలని పొగడడం.. తన గురించి గొప్పగా చెప్పుకోవడం, ప్రేమగా మాట్లాడడం వంటివి ఉంటాయి. కోడలు తనను గొప్పగా చూడడం లేదన్న భావనతో కూడా ఉంటుందట. మరొక కారణం ఆధిపత్యం చూపించాలనుకోవడం. ఈ మాహిష్మతి సామ్రాజ్యానికి తానో రాజమాత అన్నట్టు ఫీలవుతుంది. ఇలాంటి సమయంలో దేవసేనలా ఎదురుతిరిగితే వేరే మకాం పెట్టాల్సి వస్తుంది. ఇవన్నీ సరిపోవన్నట్టు ఇంట్లో గొడవలకి సీరియల్స్ లో అత్తాకోడళ్ల గొడవలు ఆద్యం పోస్తాయి. ఇవన్నీ చూసి.. అత్త అంటే కోడలిని సాధించాలి అని సాధిస్తూ ఉంటారు. కొంతమంది తాము కోడలుగా ఉన్నప్పుడు తన అత్తగారు తమని ఎలా సాధించారో.. మేము కూడా మా కోడళ్ళని అలా సాధిస్తామని ఒక సైకలాజికల్ ఫీలింగ్ తో ఉంటారట. మామూలుగా కొంతమందికి కొంతమందిని చూసిన మొదటి నుంచి ఎందుకో మంచి అభిప్రాయం ఉండదు. దీంతో వాళ్ళు మంచి పనులు చేసినా కూడా రుచించదు. సరిగ్గా ఇలానే అత్త గారికి కూడా కోడలు మంచి పనులు చేసినా రుచించదు.

Why don't aunts and daughters-in-law fall

దీనికి తోడు గత కొన్ని దశాబ్దాలుగా అత్తా, కోడళ్లు అంటే ఇండియా-పాకిస్తాన్ అనే భావాన్ని బాగా విస్తృతంగా ప్రచారం చేస్తూ వచ్చారు. దీని ప్రభావం కూడా ఉండి ఉండవచ్చునని నిపుణులు చెబుతారు. చివరాఖరున ఒకే ఇంట్లో ఉన్నా కూడా.. కొడుకు ఒక అద్దె ఇంట్లో ఉన్నట్టు భావించే పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితి వస్తే కనుక ఆ అత్తా, కోడళ్ల పోరాట సన్నివేశాలు పతాక స్థాయిలో ఉంటాయట. విడదీయడం ఎవరి వల్లా కాదు. అత్తాకోడళ్ల గొడవ అనేది యూనివర్సల్ కాన్సెప్ట్. ఈ సమస్య భారతదేశంలోనే కాదు. విదేశాల్లో కూడా ఉంది. 66 శాతం మంది కోడళ్ళు.. అత్త గారి పట్ల జీవితం మొత్తం మీద అసంతృప్తిగా ఉన్నామని, ఒత్తిడికి గురవుతున్నామని స్టడీస్ లో వెల్లడించారు. అదేంటో ఒకప్పుడు కోడలిగా ఉన్న అత్తగారు.. కోడలుగా తాను పడ్డ బాధలన్నీ మర్చిపోయి కోడలిని సాధిస్తుంటుంది. కానీ కొంతమంది అత్తాకోడళ్లు ఉంటారు. సీరియల్స్ లో శత్రువులుగా చూపించినా కూడా తల్లీ, కూతుర్లలా ఉంటారు. అలాంటి వారికి నమస్కరించాలి. 

మరి ఈ అత్తా, కోడళ్ల గొడవకి పరిష్కారం లేదా అంటే బేషుగ్గా ఉందని సైకాలజిస్టులు చెబుతున్నారు. చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచారు. ఒక్కసారిగా తమ చేతుల్లోంచి జారిపోయారు అన్న ఫీలింగ్ ని వారికి కలిగించడం కంటే వారికి నచ్చినట్టే ఉండడం ఉత్తమం అని అంటున్నారు. ఎందుకంటే వారు బతికేది కొంతకాలమే కాబట్టి. ఉన్నన్నాళ్ళు వారిని సంతోష పెడితే అంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది చెప్పండి. వాళ్ళు కన్నుమూసిన తర్వాత నచ్చినట్టు జీవించవచ్చు. అప్పుడు అడ్డు చెప్పేవాళ్ళే ఉండరు. అత్తా,కోడళ్ల గొడవని పరిష్కరించే బాధ్యత కొడుకుకే ఉంటుందని చెబుతున్నారు. తల్లిదండ్రుల దగ్గర రహస్యం ఎందుకు. ఆర్ధిక వ్యవహారాలు అయినా సరే కుటుంబమంతా కలిసి చర్చించుకోండి.

Why don't aunts and daughters-in-law fall

కొడుకు, కోడలు తమకి ప్రాధాన్యత ఇస్తున్నారని అనుకుంటారు. ఒప్పుకోకపోతే ఒప్పించండి. అంతేగానీ గొడవ మాత్రం పడకండని సూచిస్తున్నారు. సో అదండీ విషయం.. అత్తాకోడళ్ల గొడవకి కారణం సైకలాజికల్ ప్రాబ్లమ్ ఒకటైతే.. కొడుకు మరొక కారణం. భార్యని కంట్రోల్ లో పెట్టాలా? లేక అమ్మని కంట్రోల్ లో పెట్టాలా? తెలియక నరకం అనుభవిస్తూ గొడవ పెద్దది చేస్తాడట. కంట్రోల్ అన్న పదం పక్కన పెట్టి.. ఒక కొడుకుగా తన కర్తవ్యాన్ని ఎంత వరకూ నెరవేరుస్తున్నాడు, భర్తగా భార్యకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు అనే దాని మీదే ఉంటుందని సైకాలజిస్టులు చెబుతున్నారు. మరి ఈ విషయంపై మీరేమంటారు? అత్తా, కోడళ్ల గొడవలకి మీకు తెలిసిన కారణాలు ఏమైనా ఉన్నాయా? అసలు గొడవ కాకుండా ఉండాలంటే పరిష్కారం ఏమిటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి.

Tags :

  • daughter in law
  • mother in law
  • unknown facts
Read Today's Latest unknown factsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Why Finger Ring: ఉంగరపు వేలికే ఉంగరాన్ని పెట్టుకుంటారు! ఎందుకో తెలుసా?

Why Finger Ring: ఉంగరపు వేలికే ఉంగరాన్ని పెట్టుకుంటారు! ఎందుకో తెలుసా?

  • Unknown Facts: కరెంటు తీగల మీద వాలిన పక్షులకు షాక్ కొట్టదు.. ఎందుకో తెలుసా?

    Unknown Facts: కరెంటు తీగల మీద వాలిన పక్షులకు షాక్ కొట్టదు.. ఎందుకో తెలుసా?

  • వీడియో: అత్తపై కోడలి దారుణం.. మీద పడి కొడుతూ..

    వీడియో: అత్తపై కోడలి దారుణం.. మీద పడి కొడుతూ..

  • Unknown Facts: అరెస్ట్ చేసిన వ్యక్తి ముఖానికి పోలీసులు ముసుగు తొడుగుతారు.. ఎందుకో తెలుసా?

    Unknown Facts: అరెస్ట్ చేసిన వ్యక్తి ముఖానికి పోలీసులు ముసుగు తొడుగుతారు.. ఎందుకో తెలుసా?

  • 16 Digit Number On Debit Card: ఏటీఎం కార్డు మీద ఉండే 16 అంకెలకు అర్ధమేంటో తెలుసా?

    16 Digit Number On Debit Card: ఏటీఎం కార్డు మీద ఉండే 16 అంకెలకు అర్ధమేంటో తెలుసా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam