గొడుగులు ఎక్కువగా నలుపు రంగులోనే ఉంటాయి. అసలు నలుపు రంగు గొడుగులు తయారు చేయడానికి కారణం ఏంటో తెలుసా?
గొడుగు అంబ్రా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. అంబ్రా అంటే నీడ లేదా షేడ్ అని అర్థం. అయితే అంబ్రా పదం తెలుగులో అంబరం అనే పదానికి దగ్గరగా ఉంది కదా. దగ్గరగా ఉండడం కాదు, అంబరం అనే సంస్కృత పదం నుంచే అంబ్రా అనే పదం వచ్చింది. 4 వేల సంవత్సరాల క్రితం ఈ గొడుగును కనుగొన్నారు. అయితే అంతకంటే ముందు గొడుగు విష్ణు అవతారమైన వామనుడు వాడడం జరిగింది. అప్పుడు గొడుగులు వేరే. ఇప్పుడు గొడుగులు మాత్రం నల్లగా ఉంటాయి. మామూలుగా నలుపు రంగు అంటే వేడిని ఎక్కువగా గ్రహిస్తుంది. అలాంటప్పుడు గొడుగులు ఎందుకు ఎక్కువగా నలుపు రంగులో తయారు చేస్తారు. ఇప్పుడంటే రకరకాల రంగులతో గొడుగులు వస్తున్నాయి కానీ ఒకప్పుడు ఎక్కువగా నలుపు రంగు గొడుగులు ఉండేవి.
అసలు గొడుగులను నలుపు రంగులో తయారు చేయడానికి కారణం ఏంటి? అని మీకు ఎప్పుడైనా సందేహం వచ్చిందా? అయితే గొడుగులను అప్పట్లో ఎక్కువగా నలుపు రంగులో తయారు చేయడానికి పలు కారణాలు ఉన్నాయి. నలుపు రంగుని క్లాసిక్ రంగుగా చెబుతారు. ఏ అవుట్ ఫిట్ కైనా సులువుగా మ్యాచ్ అవుతుంది. లైట్ రంగులతో పోలిస్తే దుమ్ము, మరకలు నలుపు రంగు మీద కనబడవు. వీటన్నిటికంటే ముఖ్యంగా నలుపు రంగు కాంతిని, వేడిని గ్రహిస్తుంది. ఇది సూర్యుడి వేడి నుంచి రక్షించడానికి కాపాడుతుంది. ఇతర రంగులతో పోలిస్తే ఈ నలుపు రంగు అంత త్వరగా తన రంగుని కోల్పోదు. నలుపు రంగుతో చేసిన గొడుగులు వర్షంలో తడిసినప్పుడు ఇతర రంగులతో పోలిస్తే త్వరగా ఆరిపోయినట్లు గుర్తించారు. దీంతో అప్పటి నుంచి నలుపు రంగు గొడుగులనే తయారు చేసేవారు.
ఇదొక కారణం అయితే మరొక కారణం ఉంది. నలుపు రంగు తెలుపు రంగు గొడుగుతో పోలిస్తే నీడని బాగా ఇస్తుంది. అలానే నలుపు గొడుగులు సూర్యుడి నుంచి వచ్చే కాంతి శక్తిని ఎంత అధికంగా గ్రహించినా శరీరానికి ఏమీ అనిపించదు. ఎందుకంటే అది శరీరానికి తాకదు కాబట్టి వేడి అనిపించదు. ఇక మరో కారణం కూడా ఉంది. నలుపు రంగు గొడుగు వేడిని గ్రహిస్తుంది. కానీ తెలుపు రంగు గొడుగు హీట్ రేడియేషన్ ని రిఫ్లక్ట్ చేస్తుంది. దీని వల్ల వేడి కిరణాలూ పక్కకు తప్పుకుని గొడుగు కిందకు వస్తాయి. అదే నలుపు రంగు గొడుగు అయితే సూర్యకిరణాలను గ్రహిస్తుంది కానీ ఆ వేడిని మనకు చేరకుండా నిరోధిస్తుంది. అందుకే వేసవిలో నలుపు గొడుగులకు ప్రాధాన్యత ఇస్తారు. నలుపు రంగుకి అధిక వేడిని గ్రహిస్తూనే.. అదే సమయంలో వేడిని బయటకు విడుదల చేస్తుంది. అందువల్ల ఉష్ణోగ్రత అనేది గొడుగు లోపల ఉన్న వ్యక్తికి రాదు.