ప్రేమించటం ఒక కళ.. అది అందరికీ సాధ్యం కాదు.. ప్రేమించబడటం ఓ అదృష్టం అది అందరికీ దక్కదు. ఓ వ్యక్తిని ఇష్టపడటం.. ఆ వ్యక్తిని ఇంప్రెస్ చేయటం.. ఆ వ్యక్తిని మన మనసుతో పాటు ట్రావెల్ అయ్యేలా చేయటం సాధారణ విషయం కాదు. మనం ఇష్టపడే వారి మనసు, మనతో ట్రావెల్ అయినపుడు మాత్రమే మన ప్రేమ వారికి అర్థం అవుతుంది. అలా కాకపోతే అది స్నేహంగానే మిగిలిపోతుంది. సాధారణంగా అమ్మాయిలు తమంతట తాము ఎదుటి వ్యక్తి మీద ప్రేమను ప్రకటించరు. మాటలతోనో.. చేతలతోనే బహిర్గతం చేస్తూ ఉంటారు. మగాళ్లే డేర్ చేసి చెప్పాలని వారు భావిస్తుంటారు. నచ్చిన వ్యక్తి ప్రపోజ్ చేయగానే ఓకే చేసేస్తుంటారు. తమకు ఇష్టమైన అమ్మాయికి తమ ప్రేమను వ్యక్త పర్చటం కోసం ఒక్కో మనిషి ఒక్కోరకమైన విధానాన్ని ఎంచుకుంటూ ఉంటారు.
నూటికి 90 శాతం మంది మోకాలిపై వంగి, ఏదైనా గిఫ్ట్ ఇచ్చి తమ ప్రేమను చెబుతుంటారు. ఇలా మోకాలిపై కూర్చుని మగాళ్లు ప్రపోజ్ చేయటం వెనుక చాలా పెద్ద కథే ఉంది. అదేంటంటే.. మగవారు మోకాళ్లపై కూర్చుని అమ్మాయిలకు ప్రపోజ్ చేయటం అన్నది ఈనాటిది కాదు. దీనికి దాదాపు వందల ఏళ్ల చరిత్ర ఉంది. మధ్యయుగ కాలంలో రాజులను గౌరవించటానికి, తమ విధేయతను తెలుపుకోవటానికి సాధారణ జనం, సైనికులు మోకాళ్లపై వంగి ప్రణామం చేసేవారు. అదే విధంగా తమకు ఇష్టమైన అమ్మాయికి గౌరవం ఇస్తూ, తాను ఇకపై విధేయతతో ఉంటానని చెబుతూ మగాళ్లు మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేస్తుంటారు.
ఎక్కువ మంది అమ్మాయిలు ఇలా మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేయటాన్ని ఇష్టపడతారు. ఇక్కడ కండీషన్లు అప్లై అవుతాయి. తమకు ఇష్టమైన వ్యక్తి అలా చేస్తే వారికి నచ్చుతుంది. ప్రపోజ్ చేసిన వెంటనే వాళ్లు ఓకే చేయటం అన్నది వారికి మీ మీద ఉన్న ప్రేమ స్థాయిని బట్టి ఉంటుంది. ఇక, ఏ మోకాళిపై కూర్చుని ప్రపోజ్ చేశాం అన్న విషయానికి వస్తే.. అందులో ఇలానే చేయాలన్న రూలేమీ లేదు. మీకు ఎలా చేస్తే కంఫర్ట్‌గా ఉంటుందో అలా చేసుకుంటూ వెళ్లిపోవటమే. మరి, మగాళ్లు మోకాళ్లపై కూర్చుని ఆడవాళ్లకు ప్రపోజ్ చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.