కూల్ డ్రింక్ బాటిల్ లో ఖాళీ ఎందుకు ఉంటుందో తెలుసా? డ్రింక్ బాటిల్ లో డ్రింక్ ని మొత్తం నింపకుండా ఖాళీ ఉంచడానికి కారణం ఉంది.
కూల్ డ్రింక్స్ మనిషి జీవితంలో ఒక భాగమైపోయాయి. పార్టీలు, పెళ్లి వేడుకలు, ఫంక్షన్ లు ఏం జరిగినా శీతల పానీయాలు ఉండాల్సిందే. ఇక వేసవి కాలం వచ్చిందంటే ఆ తాపాన్ని తగ్గించుకోవడానికి కూల్ డ్రింకులను తాగేస్తుంటారు. అయితే కూల్ డ్రింక్ సీసాలు, కూల్ డ్రింక్ బాటిల్స్ ని గమనిస్తే అందులో డ్రింక్ అనేది నిండుగా ఉండదు. పైన కాస్త ఖాళీ ఉంటుంది. ఈ ఖాళీ ఎందుకు ఉంటుందో ఆలోచించారా? ఆ మాకెందుకు తెలియదు.. బాటిల్ మీద రేటు కనబడడం కోసం ఖాళీ ఉంచుతారు అని అంటారా? ఆ కారణం అయితే కాదు. దీనికి వేరే కారణం ఉంది. ఇలా ఎందుకు ఖాళీ ఉంచుతారంటే కూల్ డ్రింక్ బాటిల్ లేదా సీసా పగిలిపోకుండా ఉండడం కోసం. కూల్ డ్రింక్ బాటిల్ పగిలిపోవడం ఏంటి? అని అనుకుంటున్నారా? అయితే ఈ కారణం తెలుసుకోవాల్సిందే.
సాఫ్ట్ డ్రింక్స్ అంటేనే ఫ్లేవర్డ్ కార్బోనేటెడ్ వాటర్. ఇది బాటిల్ లో నింపినప్పుడు బయట ఉండే ఒత్తిడి కంటే లోపల ఎక్కువగా ఉంటుంది. అందుకే డ్రింక్ బాటిల్ లోంచి సాఫ్ట్ డ్రింక్ బయటకు రావడానికి సిద్ధంగా ఉంటుంది. బాటిల్ నిండుగా సాఫ్ట్ డ్రింక్ ని నింపితే కార్బన్ డయాక్సయిడ్ ఒత్తిడి బాటిల్ మీద పడుతుంది. ఈ ఒత్తిడి వివిధ ఉష్ణోగ్రతల్లో తీవ్ర స్థాయికి చేరుకొని బాటిల్ పగిలిపోయే అవకాశం ఉంది. అందుకే కూల్ డ్రింక్స్ ని చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద ప్యాకింగ్ చేస్తారు. ఆ తర్వాత ఎండలో పెట్టినా లేదా అధిక ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతంలో పెట్టినా బాటిల్ లోపల ఉష్ణోగ్రతలో పెద్ద మార్పు ఉండదు. బాటిల్ నీటిని 4 డిగ్రీల సెల్సియస్ వద్ద చల్లబరచినప్పుడు ఆ నీరు విస్తరించడం మొదలుపెడుతుంది. బాటిల్ చల్లబడినప్పుడు విస్తరించడం తగ్గిపోతుంది.
ఈ సమయంలో బాటిల్ లో ఖాళీ లేకపోతే అంటే గాలి గ్యాప్ లేకపోతే సాఫ్ట్ డ్రింక్ పరిమాణం సీసా పరిమాణం కంటే ఎక్కువగా ఉండి బయటకు వచ్చేస్తుంది. అందుకే బాటిల్ పై ఒత్తిడి పడకుండా కొంత ఖాళీ వదులుతారు. ఖాళీ అని మనం అనుకుంటాం గానీ ఆ ఒత్తిడిని అధిగమించడానికి అక్కడ గాలి ఉంటుంది. ఈ గాలి ఉండడం వల్ల సాఫ్ట్ డ్రింక్ ఒత్తిడి బాటిల్ పై పడదు. ఈ గాలి మీద పడుతుంది. ఈ గాలి సాఫ్ట్ డ్రింక్ ఒత్తిడిని ఆపుతుంది. ఇంకా అర్ధమయ్యేలా చెప్పాలంటే బాటిల్ లో సాఫ్ట్ డ్రింక్ ని బాగా చల్లని ప్రదేశంలో నింపినప్పుడు గడ్డ కడుతుంది. అయితే ఈ సాఫ్ట్ డ్రింక్ ని సరఫరా చేసినప్పుడు లేదా ఎండ తగిలినప్పుడు స్వల్ప మొత్తంలో సాఫ్ట్ డ్రింక్ గ్యాస్ లాగా ఏర్పడుతుంది. ఈ గ్యాస్ ఒత్తిడి కలిగి ఉంటుంది. బాటిల్ లో ఖాళీ లేకపోతే గ్యాస్ బయటకు తన్నుతుంటుంది. అందుకే అక్కడ స్పేస్ లేదు, కానీ స్పేస్ క్రియేట్ చేశారు. మరొక కారణం ఏంటంటే.. అలా గ్యాప్ ఉంచడం సవాల్ ఎక్స్ పైరీ డేట్ వరకూ క్వాలిటీ, టేస్ట్ లో మార్పు ఉండదు.