నవ్వు నాలుగు విధాలుగా చెడు అని అప్పుడప్పుడు మన పెద్దలు చెబుతుంటారు. అదే నవ్వు మన ఆరోగ్యానికి చాలా మంచిదని మాత్రం ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక మనలో సంతోషం ఎక్కువైనప్పుడు కూడా మనకు తెలియకుండా నవ్వు వస్తుంది. మనుషులకు నవ్వు ఎందుకు వస్తుంది. అసలు దీని వెనకాల దాగి ఉన్న శాస్త్రీయ కారణం ఏంటనే పూర్తి వివరాలు తెలుసుకోవాలనుందా? అయితే తప్పకుండా మీరు ఈ స్టోరీని పూర్తిగా చదవాల్సిందే.
నవ్వు.. వయసు తేడా లేకుండా ఇది ప్రతీ ఒక్కకీ వస్తుంది. సినిమాల్లోని కామెడీ సన్నివేశాలు చూసినప్పుడు కానీ, మన స్నేహితులు ఏదైన జోక్స్ వేసినప్పుడు, సంతోషం ఎక్కువైనప్పుడు కానీ వెంటనే మనకు నవ్వు వస్తుంది. ఇక అసలు విషయానికొస్తే.. మనం చేసే ఏ పనుల్లో అయినా మన మెదడు ఏది చెబితే అది చేస్తుంటాం. ఇలా మనం చేసే ప్రతీ పనికి మెదడే కీలకమనే విషయం మన అందిరికీ తెలిసిందే. అయితే మాములుగా మన స్నేహితులు ఎవరైన జోక్ వేసినా.. లేక సినిమాల్లో ఏదైన కామెడీ సన్నివేశాలు చూసిన వెంటనే మెదడులో ఉన్న ఓ నాడీ ప్రేరేపితమవుతంది. దీంతో క్షణాల్లోనే మన పెదవుల ద్వారా నవ్వు విరబూస్తుంది.
ఇదే మనం రోజూ నవ్వే నవ్వు వెనకాల ఉన్న శాస్త్రీయ కోణమట. ఇలా మనషిలో సహజంగా జరిగే ప్రక్రియ ద్వారా అనేక లాభాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. నవ్వడం ద్వారా ఒత్తిడి దూరం అవ్వడమే కాకుండా రోగనిరోదక శక్తి కూడా మెరుగు పడుతుందనే నిపుణులు తెలిపారు. ఇక నవ్వడం వల్ల మొహంలోని అవయవాలన్ని కదులుతాయని, దీంతో యవ్వనంగా కూడా ఉండవచ్చని నిపుణుల మాట. ఇదే కాకుండా పార్క్ లో ఉదయం పూట చాలా మంది ఓ చోట చేరి పెద్ద పెద్దగా నవ్వుతు ఉంటారు. అలా నవ్వడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపడడంతో పాటు ఉత్తేజంగా ఉంటారట. ఇక మీరు కూడా ఇక నుంచి నవ్వుతు సంతోషంగా ఉండండి. ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.