శుభకార్యమైనా, అశుభకార్యమైన మద్యం లేకుండా ఏ కార్యక్రమం కూడా జరగట్లేదు. బర్తుడే వేడుకలు, పెళ్లిల్లు, ఇతర ఫంక్షన్లలో మద్యం తాగి తెగ ఎంజాయ్ చేస్తుటారు. మరి కొంత మంది ఫుల్లుగా మద్యం సేవించి నియంత్రణ కోల్పోయి ప్రవర్తిస్తుంటారు. ఆ సమయంలో వారు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాదు. మద్యం మత్తులో ఏం చేస్తారో కూడా తెలియదు. కొన్ని కొన్ని సార్లు ఒళ్లు తెలియకుండా ప్రవర్తించి ప్రమాదాలు భారిన పడుతుంటారు.

మద్యం తాగే వారి సంఖ్య పెరుగుతూ పోతుందే తప్పా తగ్గడం మాత్రం జరగట్లేదు. మద్యానికి బానిసై కుటుంబాలను సైతం రోడ్డుపడేసిన ఘటనలు మనం చూసే ఉంటాం. మద్యానికి బానిసైన వారు డబ్బుల కోసం ఇంట్లో వారిని వేదించిన సంఘటనలు కోకొల్లలుగా చోటుచేసుకున్నాయి. అయితే కొంతమందికి మద్యం సేవించినప్పటికి దాని మత్తు ప్రభావం ఎక్కువగా ఉండదు. మరికొందరేమో తూగుతూ నానా రచ్చ చేస్తారు. ఆరోగ్యం పాడవుతుందని తెలిసి కూడా ఆ అలవాటును మానుకోరు. అయితే తాగిన మత్తు దిగేందుకు కొంత మంది పెరుగు, మజ్జిగ తీసుకోవడం చేస్తుంటారు. టీ, కాఫీలు తీసుకుని కూడా మత్తును వదిలించుకోవాలని ప్రయత్నిస్తుంటారు. అయితే వీటివల్ల నిజంగానే మత్తు దిగుతుందా.. మద్యం మత్తు పై ఆ పదార్థాలు ప్రభావం చూపుతాయ అనేది తెలుసుకుందాం.
మద్యం సేవించినపుడు అది ప్రేగుల ద్వారా జీర్ణాశయంలోకి చేరుతుంది. అక్కడి నుంచి అది రక్తంలో కలుస్తుంది. మద్యం ముఖ్యంగా నాడీవ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. రక్తంలో కలిసిన ఆల్కాహాల్ కాళేయానికి చేరుకుంటుంది. అది అక్కడ కొద్ది మోతాదులో మాత్రమే జీవక్రియ చేయబడుతుంది. మిగిలినదంతా రక్తంలోనే ఉండిపోతుంది. దీని ప్రభావంతోనే మత్తు కలుగుతుంది. అయితే మద్యం మత్తును టీ, కాఫీలు ప్రభావితం చేస్తాయనేదానికి ఆధారాల్లేవు. వీటిలోని కెఫిన్ జీవక్రియపై ఎటువంటి ప్రభావం చూపదు. మద్యం సేవించిన తరువాత మత్తు వదిలించుకోవడానికి చల్లని నీటితో స్నానం చేయడం, ఐస్ క్రీం తినడం వంటివి చేస్తారు. వీటివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. వ్యక్తి ఆరోగ్యం, జీవక్రియ వేగం మత్తు దిగడానికి తోడ్పడతాయి.