భారతదేశంలో ఉన్న ప్రతీ ఆచారం వెనుక శాస్త్రీయ దృక్పథం ఉంటుంది. ప్రతీ ఆచారంలోనూ శాస్త్రీయంగా మనిషికి మేలు చేసే ప్రయోజనాలు ఉంటాయి. భారతీయ సంస్కృతిలో పూలు అనేవి ఒక భాగం. ఆలయానికి వెళ్లినా, ఇంట్లో పూజ చేసినా, పండుగలప్పుడు గుమ్మాలకు, శుభకార్యాలకు, అలంకారం కోసం, మనిషి చనిపోతే దేహం మీద చల్లడం కోసం ఇలా అనేక రకాలుగా పుష్పాలను వాడడం అనేది జీవన విధానంలో ఒక భాగంగా వస్తున్న ఆచారం. పూలు మనిషికి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, సానుకూల దృక్పథాన్ని కలిగిస్తాయి. అయితే ఎన్ని పూలు ఉన్నా మల్లెపూలు మాత్రం ప్రత్యేకమనే చెప్పాలి. పూజల్లోనే కాకుండా నిత్య జీవితంలో మల్లెపూలతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఏ పూలు ధరించినా.. మహిళలకు ప్రయోజనమే అయితే మల్లెపూలు ధరిస్తే ఆరోగ్యపరంగా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పెళ్ళైన స్త్రీలు చాలా మంది మల్లెపూలు ధరిస్తారు. ఇప్పుడు మల్లెపూలు పెట్టుకునే వాళ్ళు తగ్గిపోయి ఉండచ్చు గానీ ఒకప్పుడు మల్లెపూలు పెట్టుకునేవారు. మల్లెపూలు అంటే భర్తను ఆకట్టుకోవడానికి అని మాత్రమే అనే విధంగా ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు. సినిమాల్లో కూడా మల్లెపూలను ఫస్ట్ నైట్ కి పరిమితం చేసేసారు. నిజానికి మల్లెపూలు అంటే పెళ్ళైన మొదటి రాత్రి అప్పుడో లేదా మోజు ఉన్నన్ని రోజులు పెట్టుకోవడానికో కాదు. ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే దీని వెనుక ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మల్లెపూలు పెట్టుకోవడం అనేది ఒక ఆయుర్వేద సాధన. పెళ్ళైన తర్వాత మొదటి రాత్రిన మహిళ మల్లెపూలు ధరించడం అనేది సహజం. ఈ మల్లెపూల సువాసన మెదడుని ప్రశాంతంగా ఉంచి.. భయాన్ని, సిగ్గుని తొలగిస్తుంది.
పడక గదిలో మంచం మీద ఉన్నప్పుడు మెదడు యొక్క టెన్షన్ ని దూరం చేస్తుంది. ఈ మల్లెపూల వాసనకు భర్తకు ఉన్న భయం, టెన్షన్ దూరమవుతాయి. దీని వల్ల స్కలనం కాకుండా ఉంటుంది. సంభోగంలో ఉన్నప్పుడు దంపతులు.. మల్లెపూల వాసన పీల్చడం వల్ల మెదడు ప్రశాంతంగా ఉంటుంది. ఉత్తేజం కలుగుతుంది. బెడ్ మీద మల్లెపూలు చల్లడం వల్ల నూతన దంపతులకు ఉత్తేజం, ఆనందం పెరుగుతాయి. ప్రస్తుత జనరేషన్.. కార్యం తర్వాత సిగరెట్ తాగడాన్ని ఘనకార్యంగా ఫీలవుతున్నారు. సిగరెట్ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది అని అనుకుంటున్నారు. నిజానికి సిగరెట్ వల్ల శరీరానికి గానీ, మెదడుకు గానీ ప్రయోజనం ఉండదు. కానీ మల్లెపూల వల్ల భార్యకు, భర్తకు ఇద్దరికీ ప్రయోజనమే అని నిపుణులు చెబుతున్నారు.
సాంప్రదాయ పరంగా, మతపరంగా, సామాజిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా, ఔషధ పరంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందానికి, గాఢమైన ఆప్యాయతకు, సంతోషానికి, పొందికకు చిహ్నంగా ఈ మల్లెపూలను పరిగణిస్తారు. అయితే మీకు తెలుసా.. మల్లెపూలను చనుబాలు ఇచ్చే స్త్రీలు ఎక్కువగా ధరించేవారు. మల్లెపూలను తలలో పెట్టుకోవడం వల్ల బిడ్డకు కావాల్సిన పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయని పూర్వీకులు చెప్పేవారు. ఇవి లాక్టేషనల్ అమెనోరియాను పెంచడమే కాకుండా.. పాల ఉత్పత్తికి కావాల్సిన గాలాక్టోపోయిసిస్ స్థాయిని పెంచుతుంది. మల్లెపూలు తలలో పెట్టుకోవడం వల్ల పుర్రె వేడిని జుట్టు ద్వారా మల్లెపూలు గ్రహించి.. బయటకు పంపించేస్తాయి. చల్లదనం కోసం మల్లెపూలు పెట్టుకునేవారు.
పూర్వం మగాళ్ళకి కూడా జుట్టు పొడవుగా ఉండేదట. వారు కూడా మల్లెపూలు ధరించేవారట. అయితే ఫ్యాషన్ కారణంగా మగాళ్లు పెట్టుకోవడం మానేశారు. ఇక నిద్రలేమితో బాధపడేవారికి ఈ మల్లెపూల వాసన మెడిసన్ లా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మల్లెపూల వాసనకు మత్తు వస్తుంది. అతి కోపాన్ని కూడా ఈ మల్లెపూలు తగ్గిస్తాయని చెబుతున్నారు. చిరాకు, కోపం వంటి వాటిని తగ్గించి మానసిక ప్రశాంతతను ఇస్తుంది. అలానే స్త్రీలలో పాల ఉత్పత్తికి ప్రేరేపిస్తుంది. మరీ ముఖ్యంగా.. దాంపత్య జీవితం మరింత దృఢంగా బలపడేందుకు మల్లెపూలు సహకరిస్తాయి. మరి ఈరోజుల్లో మల్లెపూలు ఎంతమంది మగువలు ధరిస్తున్నారు? ఎంతమంది భర్తలు తమ భార్యలకు మల్లెపూలు పట్టుకెళ్తున్నారు? ఇక మల్లెపూలు పెట్టుకోవడం వెనుక మీకు తెలిసిన కారణాలు ఉంటే కామెంట్ చేయండి.