ఈతరం అమ్మాయిలు చున్నీ వేసుకోవడం మానేశారు.. ఎందుకో తెలుసా?

అమ్మాయిలు డ్రెస్ మీద చున్నీ లేదా దుపట్టా వేసుకోవడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం. అయితే ఈ తరం అమ్మాయిలు చున్నీ వేసుకోవడమే మానేశారు. దీనికి కారణం తెలుసా?

  • Written By:
  • Publish Date - May 27, 2023 / 04:26 PM IST

ఒకప్పుడు అమ్మాయిలు అంటే పొడవాటి జుట్టుతో కనిపించేవారు. ఇప్పుడు చాలా మంది జడలు వేసుకోవడమే మానేశారు. అలా అని జడలు వేసుకోకపోవడాన్ని నేరంగానో, వేసుకోని వాళ్ళని నేరస్తులుగానో ఎవరూ చూడడంలేదు. మన దేశంలో ఉన్న గొప్పతనం అదే. మెజారిటీ వర్గం ఒకరి భావాలకు అడ్డు చెప్పదు. అయితే మీరు గమనించారో లేదో ఈ తరం అమ్మాయిలు చున్నీలు వేసుకోవడమే మానేశారు. కొంతమంది ఇప్పటికీ ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. కొంతమంది మగాళ్ల చూపుల నుంచి తప్పించుకోవడం కోసం వేసుకుంటున్నారు. ఇంట్లో అమ్మో, అక్కో అయితే చున్నీ వేసుకోకుండా తిరుగుతున్న తనని చూసి ఎక్కడ తిడుతుందో అన్న భయంతో చున్నీ వేసుకునేవారు కొందరైతే.. మగాళ్లకు కనబడకుండా ఉండడం కోసం వేసుకునేవారు కొందరు.

అయితే ఇప్పుడు ఎవరెలా పోయినా మాకు సౌకర్యమే ముఖ్యం అని చాలా మంది చున్నీలు వేసుకోవడమే మానేశారు. ఒకప్పుడు రెండు భుజాల మీద చున్నీ వేసుకుని ముందు భాగాన్ని కవర్ చేసుకుంటారు. ఏదైనా పనిలో భాగంగా కాస్త వంగినా కనబడకుండా ఉండడం కోసం వేసుకునేవారు. అయితే చున్నీ వేసుకోవడం వల్ల అస్తమానూ సర్దుకోవడం అనేది ఇబ్బందిగా ఉంటుంది. ఈ తరం అమ్మాయిలు చున్నీ వేసుకోకపోవడానికి ఇదొక కారణం. మరొక కారణం ఫ్యాషన్. ఇప్పుడు కొత్త కొత్త ఫ్యాషన్లు వచ్చేశాయి. 1990ల్లో మిడ్డీలు, చుడీదార్ లను అమ్మాయిలు ఎక్కువగా వేసుకునేవారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత చుడీదార్ ల స్థానంలో కుర్తాలు వచ్చాయి. తర్వాత జీన్స్, టీ షర్ట్స్ రావడం.. అమ్మాయిలను ఈ దుస్తుల్లో చూడడం వల్ల అలవాటు జనాలకు అయిపోయింది.

దీంతో చున్నీ వేసుకున్నా, వేసుకోకున్నా పెద్దగా పట్టించుకోవడం లేదు. కొంతమంది ఇప్పటికీ చున్నీ వేసుకుంటున్నారు. కొంతమంది సైడ్ కి వేసుకుంటున్నారు. కానీ దాదాపు చాలా మంది అమ్మాయిలు చున్నీ అయితే వేసుకోవడం లేదు. దీనికి సౌకర్యం ఒక కారణమైతే, ఫ్యాషన్ మరొక కారణం. అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ట్రెడిషన్ ని పక్కన పెట్టి ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు. ఒకప్పుడు పంచెలు కట్టుకునేవారు. ఇప్పుడు పంచెలు వేసుకునేవారు చాలా తక్కువైపోయారు. శుభకార్యం అప్పుడు తప్ప రెగ్యులర్ గా ఎవరూ వేసుకోవడం లేదు. ఒకప్పుడు బెల్ బాటమ్ ప్యాంట్లు వాడేవారు. తర్వాత జీన్స్ వాడడం మొదలుపెట్టారు. బూట్ కట్ అని, పెన్సిల్ కట్ అని, బ్యాగీ ప్యాంట్లని, కార్గో ప్యాంట్లని ఇలా రకరకాల ఫ్యాషన్లు వచ్చాయి.

ఒకప్పుడు మగాళ్లు తలపాగా చుట్టుకునేవారు, ఇప్పుడు చుట్టుకోవడమే మానేశారు. మగాళ్లు ధోతి కుర్తా ధరించడం లేదు. అందరూ ఫ్యాషన్ వైపు పరుగులు పెడుతున్నారు. అబ్బాయిలు ఫాలో అవ్వగా లేనిది మేము ఫ్యాషన్ ని అనుసరిస్తే వచ్చిందా అని తిరిగి ప్రశ్నించే అమ్మాయిలు కూడా ఉన్నారు. అయితే ఈ చున్నీ బండి చక్రంలో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. ఇది కూడా ఒక కారణమని కొంతమంది చెబుతారు. అయితే బైక్ పై వెళ్లే సమయంలో చున్నీ గాలికి వదిలేయకుండా ఒడిలో పెట్టుకోవాలని చెబుతారు. చీర కట్టుకున్న వారు కూడా బండి చక్రంలో చీర కొంగు పడి కింద పడ్డ సందర్భాలు ఉన్నాయి. అలా అని చీరను పక్కన పెట్టారా మన పెద్దలు. జాగ్రత్త పడే దానికి, దూరం పెట్టే దానికి తేడా ఉందనేది కొందరి అభిప్రాయం. ఎవరి అభిప్రాయం వారిది. మరి మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest unknown factsNewsTelugu News LIVE Updates on SumanTV

Most viewed