సాధారణంగా తేలు కనబడగానే మనం వాటికి భయపడిపోయి కొట్టి చంపేస్తుంటాం. కానీ, వాటి విలువ తెలిస్తే మాత్రం అలా చేయం. తేలు విషం మార్కెట్‌లో కోట్ల రూపాయలు పలుకుతోంది. డెత్‌స్టాకర్ జాతి తేళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాలి.
తేలు.. ఈ పేరు వినగానే కొంతమంది ఒళ్లు జలదరిస్తుంటుంది. ఇంకా కొంతమంది దాన్ని చూస్తే వికారంతో పాటు భయం కూడా కలుగుతుంది. అయితే, ఈ సృష్టిలోని ప్రమాదకరమైన జీవుల్లో ఒకటైన తేలుకు మార్కెట్‌లో చాలా విలువ ఉంది. ప్రపంచంలో అత్యంత విలువైన ద్రవంగా తేలు విషం టాప్‌లో నిలిచింది. ఎందుకంటే.. తేలు విషంలో మనుషుల్ని చంపే గుణాలకంటే ఎక్కువగా మంచి గుణాలు ఉన్నాయి. బ్రిటానియా.కామ్ వెబ్‌సైట్ ప్రకారం. 4 లీటర్ల డెత్ స్టాకర్ జాతికి చెందిన తేలు విషం ధర 320 కోట్ల రూపాయలుగా ఉంది. ఇంతలా వందల కోట్ల రూపాయల ధర పలికేంతలా ఆ తేలు విషంలో ఏముంది? ఆ తేలు ప్రత్యేకతలేంటి ఇప్పుడు తెలుసుకుందాం..
డెత్‌స్టాకర్ రకం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన తేళ్లు. ఇవి నార్త్ ఆఫ్రికానుంచి మిడిల్ ఈస్ట్‌లోని ఎడారి ప్రాంతాల్లోనే కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా సహారా, అరేబియన్, థార్ సెంట్రల్, సెంట్రల్ ఏషియా ఎడార్లు జీవిస్తుంటాయి. వీటి విషంలో న్యూరో టాక్సిన్స్.. క్లారోటాక్సిన్స్.. క్యారిబ్డోట్యాక్సిన్స్, సిల్లాటాక్సిన్స్, ఏజిటాక్సిన్స్ ఉంటాయి. ఇది కరిస్తే చాలా నొప్పిగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న యవ్వనస్తులను ఈ విషం చంపేయలేదు.
ఈ జాతికి చెందిన తేళ్ల విషం ద్వారా క్యాన్సర్ గడ్డలను కనుగొనటం, మలేరియా చికిత్స మెదడు సంబంధిత గడ్డల నివారణ, డయాబెటీస్‌ను నయం చేయటంలోనూ ఈ తేలు విషం ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శాస్త్రవేత్తల ప్రకారం.. తేలు విషంలోని క్లోరోటాక్సిన్ కొన్ని రకాల క్యాన్సర్లను నివారించటంలో ఉపయోగపడుతుంది. అంతేకాదు! క్యాన్సర్ గడ్డలు ఎక్కడ ఉన్నాయో గుర్తించటం.. వాటి సైజులు కనుక్కోవటంలోనూ ఉపయోగపడతాయి. వీటితో పాటు ఎన్నో రకాలుగా వైద్య రంగంలో వాడుతున్నారు.
ఎన్ని ఉపయోగాలు ఉన్నా మరీ ఇంత ధరా అన్న డౌట్ రావచ్చు. కానీ, డిమాండ్ అండ్ సప్లై థియరీ ప్రకారం సప్లై తక్కువగా ఉన్న వస్తువులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా అంతే.. సాధారణంగా ఏ తేలు విషం అయినా తక్కువ మోతాదులో తీసేందుకు వీలుంటుంది. ఒక తేలు నుంచి ఒకసారి కేవలం ఒక మిల్లీగ్రామ్ విషాన్ని మాత్రమే తీయగలం. అది కూడా పాలు పితికినట్లు చేత్తో వాటిని తీయాల్సి వస్తుంది. అందుకే తేలు విషానికి డిమాండ్ ఎక్కువ. మరి, వందల కోట్ల రూపాయల ధర పలుకుతున్న ఈ తేలు విషంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.