జాబ్ మానేశారా? లేక ఉద్యోగం పోయిందా? అయితే మీకు కంపెనీ మీకు డబ్బులు చెల్లిస్తుందని తెలుసా? మీరు పని చేసిన సంవత్సరాలు, మీ జీతం బట్టి మీకు వేలు, లక్షలు చెల్లిస్తుంది. అయితే కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. మరి దీని గురించి తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయాల్సిందే.
గ్రాట్యుటీ అనేది ఒకటి ఉందని చాలా మందికి తెలియదు. చాలా తక్కువ మందికి మాత్రమే దీని గురించి తెలుస్తుంది. ఉద్యోగం నుంచి విరమణ పొందుతున్నా లేదా జాబ్ మానేస్తున్నా గానీ కంపెనీ తన ఉద్యోగులకు గ్రాట్యుటీ అనేది ఇవ్వాలి. ఒక ఉద్యోగి 5 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు ఒకే కంపెనీలో పని చేసినట్లయితే కనుక ‘ది పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ 1972 ప్రకారం.. ఆ ఉద్యోగి సీటీసీలో గ్రాట్యుటీ ఉన్నా, లేకున్నా సరే కంపెనీ నుంచి వెళ్లిపోయిన 30 రోజుల లోపు ఆ ఎంప్లాయ్ కి గ్రాట్యుటీ అమౌంట్ ని చెల్లించాలి. ఏదైనా వ్యాధికి గురైనా లేదా ప్రమాదానికి గురైనా గానీ ఆ ఉద్యోగికి గ్రాడ్యువిటీ అమౌంట్ అనేది ఐదేళ్ల లోపు వస్తుంది. లాస్ట్ తీసుకున్న జీతాన్ని, పని చేసిన సర్వీస్ పీరియడ్ ని ఆధారం చేసుకుని కంపెనీలు గ్రాడ్యువిటీ అమౌంట్ ని చెల్లిస్తాయి.
పదవీ విరమణ పొందిన వారికి.. ఒకే కంపెనీలో ఐదేళ్లు, ఆపై పని చేసి సంస్థ నుంచి వెళ్ళిపోయిన వారికి గ్రాట్యుటీ వస్తుంది. ఒకవేళ ఉద్యోగి చనిపోతే ఆ గ్రాట్యుటీ అమౌంట్ ని నామినీకి చెల్లిస్తారు. ప్రమాదం లేదా వ్యాధికి గురై వైకల్యం వస్తే ఉద్యోగికి గ్రాట్యుటీ అమౌంట్ ఇస్తారు. గ్రాట్యుటీ అమౌంట్ రావాలంటే ఒక కంపెనీలో కనీసం ఐదేళ్లు పని చేయాలి. ఉదాహరణకు మీ జీతం నెలకు రూ. 15 వేలు అనుకుంటే.. ఐదేళ్లు పని చేసిన తర్వాత జాబ్ మానేస్తే మీకు కంపెనీ నుంచి రూ. 43,269 వస్తాయి. ఒకవేళ రూ. 30 వేలు జీతం ఐతే కనుక రూ. 86,538 వస్తాయి. అదే రూ. 50 వేలు జీతమైతే కనుక రూ. 1,44,231 వస్తాయి. రూ. లక్ష జీతమైతే కనుక రూ. 2,88,462 వస్తాయి. అదే లక్ష జీతం తీసుకున్న వ్యక్తి పదేళ్లు పని చేసి సంస్థ నుంచి వెళ్ళిపోతే రూ. 5,76,923 వస్తాయి.
రూ. 15 వేలు జీతగాళ్ళు పదేళ్లు పనిచేస్తే రూ. 86,538, రూ. 30 వేల జీతగాళ్ళు పదేళ్లు పని చేస్తే రూ. 1,73,077 వస్తాయి. పదేళ్లు పని చేసిన రూ. 50 వేల జీతగాళ్ళకి జాబ్ మానేసిన తర్వాత రూ. 2,88,462 వస్తాయి. ఈ గ్రాట్యుటీని n*b*15/26 సూత్రం ఆధారంగా లెక్కిస్తారు. n అంటే ఒక కంపెనీలో పని చేసిన కాలం, b అంటే ఆఖరి జీతం (బేసిక్ పే, డీఏ కలిపి). ఈ రెండిటినీ గుణించి, ఆ తర్వాత 15తో గుణించి 26తో భాగిస్తారు. ఉదాహరణకు మీరు ఉద్యోగం మానేసే ముందు తీసుకున్న జీతం రూ. 10 వేలు ఐతే కనుక ఐదేళ్లు పని చేసి జాబ్ మానేస్తే కనుక మీకు రూ. 28,846 వస్తాయి. 10,000*5*15/26=28,846.153 వస్తుంది. అంటే 28,846 రూపాయలు కంపెనీ మీకు చెల్లిస్తుంది. ఈ గ్రాట్యుటీ అనేది ఏ కంపెనీకైనా వర్తిస్తుంది. మీరు కనుక ఒక కంపెనీలో ఉద్యోగంలో చేరి ఐదేళ్లు సర్వీస్ పూర్తి చేసుకుని.. జాబ్ మానేస్తున్నట్లైతే కనుక మీకు జీతంతో పాటు అదనంగా గ్రాట్యుటీ అమౌంట్ వస్తుంది. పైన చెప్పిన సూత్రం ఆధారంగా మీ గ్రాట్యుటీ అమౌంట్ ని లెక్కించుకోవచ్చు. లేదా వెబ్ సైట్