ఈ భూమ్మీద జీవం ప్రారంభమైన నాటి నుంచి.. ఇప్పటి వరకు అంటే.. వేల సంతవ్సరాలుగా.. ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. స్థిర నివాసం లేకుండా.. సంచార జీవితం గడిపిన మనిషి.. నెమ్మదిగా క్రమబద్దమైన జీవితానికి అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో తన సౌలభ్యం కోసం అనేక వస్తువులను తయారు చేసుకున్నాడు.. చేసుకుంటూనే ఉన్నాడు. పూర్వ కాలంలో.. ఇప్పటిలా బెడ్స్, కుర్చీలు అంటూ విలాసాలు లేవు. కిందనే కూర్చోవడం.. పడుకోవడం. అయితే కాలంతో పాటు.. ఆ అలవాట్లు కూడా పోయాయి. ఇప్పుడు లేచింది మొదలు.. పడుకునే వరకు చైర్లు, బెడ్, సోఫా.. వీటిని కాదని నేల మీద కూర్చునే ప‍్రసక్తే లేదు.
ఇలా మన సౌకర్యం కోసం తయారు చేసుకున్న వాటిల్లో కుర్చీలు, టేబుల్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం వీటి వాడకం లేని ఇళ్లు లేవంటే అతిశయోక్తి కాదు. ఇక మనం చిన్న చిన్న హోటల్స్, టిఫిన్ బండ్ల దగ్గర ప్లాస్టిక్ కుర్చీలు, స్టూల్స్ చూస్తుంటాం. అయితే వీటి పైన రంధ్రం ఉంటుంది గమనించారా.. ఎందుకు ఉంటుంది అని ఎప్పుడైనా ఆలోచించారా. మరి ప్లాస్టిక్ కుర్చీలు, టేబుల్స్‌కి ఇలా రంధ్రాలు ఎందుకు పెడతారో మీకు తెలుసా.. లేదా అయితే ఇది చదవండి.
ప్లాస్టిక్ స్టూల్స్ ఎక్కువ స్థలం తీసుకోవు. ఒకదాని మీద ఒకటి పేరుస్తూ పోవచ్చు. అందుకే టిఫిన్ బండ్లు, చిన్న చిన్న హోటల్స్‌లో వీటిని ఎక్కువగా వాడుతుంటారు. అయితే ఇలా వీటిని ఒకదాని మీద ఒకటి పేర్చినప్పుడు.. వాటిని సులువుగా విడదీసేందుకు గాను ఇలా రంధ్రం పెడతారు. ఒకవేళ స్టూల్స్‌పైన ఇలా రంధ్రం లేకపోతే.. ఒత్తిడి, పీడనం కారణంగా.. వాటిని వేరు చేయడం కష్టం అవుతుంది. అందుకే వాటికి రంధ్రాలు పెడతారు.