తరచుగా రైలు ప్రయాణాలు చేసే వారు ఈ ఒక్క పని చేయడంతో వారు కుటుంబానికి కొండంత భరోసానిచ్చినవారువుతారు. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసే సమయంలో ఆ సదుపాయాన్ని ఉపయోగించుకుని రూపాయి కంటే తక్కువ చెల్లించి ఏకంగా రూ. 10 లక్షల వరకు బీమా పొందవచ్చు. ఆ వివరాలు మీకోసం..
అనుకోకుండా జరిగే ప్రమాదాలు కుటుంబాలను చిన్నాబిన్నం చేస్తాయి. అప్పటిదాక సంతోషంగా సాగిన వారి జీవితాల్లో పెను విషాదం చోటుచేసుకుంటుంది. ఇది కాక ఆ కుటుంబాన్ని పోషించే వ్యక్తికి ఏదైనా జరగరానిది జరిగితే ఆ కుటుంబం రోడ్డున పడాల్సిన దుస్తుతి ఏర్పడుతుంది. రోడ్డు ప్రమాదాలు కానీ, రైలు ప్రమాదాలు కానీ జరిగినపుడు దానికి ముందే ప్రమాద బీమా చేయించుకున్నట్లైతే ఆ వచ్చే పరిహారంతో ఆ కుటుంబం కొంత ఊరట చెందే అవకాశం ఉంటుంది. రైల్వే ప్రయాణికులకు ట్రైన్ ఆక్సిడెంట్ జరిగినపుడు ట్రైన్ ట్రావెల్ ఇన్సూరెన్సూ ఆర్థికంగా ఆదుకుంటుంది. దీనికోసం వందలు వేలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కేవలం 45 పైసలతో రూ. 10 లక్షల ప్రయాణ ప్రమాద బీమా పొందవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
వ్యాపారాలు చేసే వారు, ఉద్యోగులు, ఇతర వర్గాలకు చెందిన వారు తరచుగా రైలు ప్రయాణాలు చేసే వారు కొద్ది పాటి అవగాహనతో పది లక్షల వరకు ప్రమాద బీమా పొందవచ్చును. ప్రమాద బీమా అనేది ఎళ్లవేళలా కుటుంబాన్నీ కాపాడుతుంది. ట్రైన్ జర్నీ కోసం ఆన్ లైన్లో టికెట్ బుక్ చేసుకునే సమయంలో ట్రావెల్ ఇన్సూరెన్స్ కు సంబంధించిన ఆప్షన్ కూడా కనిపిస్తుంది. దీనిని ఎంచుకోవడం వల్ల కేవల 45 పైసలతో రూ. 10 లక్షల బీమా అందుతుంది. ట్రైన్ జర్నీ చేసేటపుడు హఠాత్తుగా ప్రమాదం సంభవిస్తే ఆ బీమా డబ్బుతో కుటుంబం ఆర్థిక కష్టాల నుంచి బయటపడొచ్చు. అయితే చాలా మంది ప్రయాణికులు రైలు ప్రయాణం చేయాల్సి వచ్చినపుడు ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసే సమయంలో ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్ ను ఎంచుకోవట్లేదు. దీనిపై అవగాహన లేక కొందరు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవట్లేదు.
అయితే ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకున్న సమయంలో ట్రావెల్ ఇన్స్ రెన్స్ ఆప్షన్ ను ఎంచుకున్నట్లైతే రైలు ప్రయాణంలో ప్రమాదం చోటుచేసుకుంటే ఆ ప్రయాణికుడికి జరిగిన నష్టాన్ని బట్టి బీమా మొత్తం అందుతుంది. రైలు ప్రమాదంలో ప్రయాణికుడు మరణిస్తే అతని కుటుంబానికి లేదా నామినికి రూ. 10 లక్షలు సదరు బీమా కంపెనీ అందిస్తుంది. ప్రయాణికుడు పూర్తి అంగవైకల్యానికి గురైతే పూర్తి బీమా, పాక్షిక అంగవైకల్యానికి గురైతే రూ. 7.5 లక్షలు, గాయాలైన వారికి రూ. 2 లక్షలు చెల్లిస్తారు. ప్రమాదం జరిగిన 4 నెలల్లోగా సదరు బీమా కంపెనీని సంప్రదించి వారు అడిగిన సరైన పత్రాలతో క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని వివరాలను పరిశీలించిన తరువాత బీమా కంపెనీ సదరు వ్యక్తికి గానీ, కుటుంబానికి గానీ బీమా సొమ్మును అందిస్తుంది.
నామినీ వివరాల నమోదు
రైలు ప్రయాణం కోసం ఆన్ లైన్లో టికెట్ బుకింగ్ చేస్తున్నప్పుడు ఐఆర్ సిటిసి వెబ్ సైట్లో, రైల్వేకు సంబంధిచిన యాప్స్ లలో ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ ఎంచుకున్న తరువాత మొబైల్ నెంబర్ కు లేదా ఈ మెయిల్ ఐడీకి లింక్ వస్తుంది. ఆ లింక్ ను బీమా సంస్థ పంపిస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మరో పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ కుటుంబ సభ్యుల్లో ఒకరిని నామినీగా ఎంచుకుని వారికి సంబంధించిన వివరాలను నమోదు చేయాలి. ఇలా చేయడం వల్ల బీమా పాలసీ దారుడు మరణించినప్పటికీ, బీమా పాలసీలో నామిని పేరు ఉండడం వల్ల బీమా క్లెయిమ్ పొందడం సులభం అవుతుంది.