దివంగత నేత వై.ఎస్. రాజశేఖర్రెడ్డి కూతురు వైఎస్ షర్మిల కొంతకాలంగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె తెలంగాణలో వైఎస్సార్‌టీపీ పార్టీ స్థాపించారు. ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యలు వెలులోకి తీసుకు వస్తున్నారు.
తెలంగాణలో దివంగత నేత వై.ఎస్. రాజశేఖర్రెడ్డి కూతురు వైఎస్ షర్మిల రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో వైఎస్సార్‌టీపీ పార్టీ స్థాపించి పలు కార్యక్రమాలు, యాత్రలు చేపట్టి ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణలో కేసీఆర్ సర్కార్ అవినీతి పై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ‘ఛలో పార్లమెంట్ ’ కి పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న కారణంతో ఆమె తలపెట్టిన కార్యక్రమానికి పోలీసులు అనుతినివ్వలేదు. అయినప్పటికీ షర్మిల పార్లమెంట్ ముట్టడికి బయలుదేరుతున్న సమయంలో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భారీగా అవినీతి జరిగిందని.. కేసీఆర్ సర్కార్ పై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ ఆమె ‘ఛలో పార్లమెంట్’ కి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద వైఎస్ షర్మిల ధర్నాకు దిగారు. అక్కడ నుంచి పాదయాత్ర చేసుకంటూ పార్లమెంట్ ముట్టడికి బయలు దేరారు. తెలంగాణలో ఎన్నో స్కాములు జరుగుతున్నాయని.. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. దేశంలోనే అతి పెద్ద కుంభకోణంల కాలేశ్వరం ప్రాజెక్ట్ అని ఇందులో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని అన్నారు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ భారీఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఆందోళన, ధర్నాలు చేయడానికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. అయినా షర్మిల ముట్టడికి ప్రయత్నం చేయడంతో షర్మిలతో పాటు వైఎస్సార్‌టీపీ శ్రేణులను కూడా పోలీసులు అరెస్ట్ చేసి పార్లమెంట్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అక్కడ పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు వినిపించాయి.. కొద్ది సేపు తోపులాట జరిగింది. పరిస్థితి ఒక్కసారే ఉద్రిక్తంగా మారింది.
#WATCH | YSRTP chief YS Sharmila detained by police during a protest against Telangana’s KCR government in Delhi. She has alleged irregularities in Kaleshwaram Lift Irrigation Project pic.twitter.com/upmfSUqTLz
— ANI (@ANI) March 14, 2023