వైఎస్ షర్మిల గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఆమె రాజకీయాల్లో కూడా క్రీయాశీలక పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణలో వైఎస్సార్‌టీపీ పార్టీ స్థాపించి.. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్నారు షర్మిల. ఈ క్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఆ వివరాలు..
రాజన్న బిడ్డ వైఎస్ షర్మిల తెలంగాణలో ప్రత్యేక పార్టీ వైఎస్సార్‌టీపీ స్థాపించి.. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తోంది. ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర చేపట్టి.. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తోంది. కొన్ని రోజుల క్రితం షర్మిల పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఆమె వాహనంపై కొందరు దుండగులు దాడి చేశారు. పాదయాత్రకు అనుమతి నిరాకరించారు. ఆ తర్వాత ఆమె కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నారు. ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. ఈ క్రమంలో పాదయాత్రలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఆ వివరాలు..
తెలంగాణలో కల్లు తాగడం అనేది సర్వసాధారణం. ఆల్కాహాల్‌తో పోలిస్తే.. కల్లుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఆల్కహాల్ బదులు స్వచ్ఛమైన కల్లు తాగడం చాలా మంచిది అంటారు నిపుణులు. ఈ క్రమంలో పాదయాత్రలో భాగంగా పాలకుర్తిలో పర్యటిస్తున్న షర్మిల.. కల్లు (నీరా) రుచి చూశారు. కల్లు తాగడం తనకు అలవాటు లేదని.. కానీ గీత కార్మికుడి అభ్యర్థన మేరకు రుచి చూశానని తెలిపారు. గీత కార్మికుడితో కాసేపు మాట్లాడిన షర్మిల వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాము అధికారంలోకి వచ్చాక.. ముందుగా గీత కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని.. వారికి పెద్ద పీట వేస్తామని తెలిపారు. ఇక షర్మిల కల్లు (నీరా) రుచి చూసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇక నేడు పాలకుర్తి నియోజకవర్గంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర కూడా కొనసాగనుంది. ఒకే రోజు.. ఒకే నియోజకవర్గంలో ఇద్దరు నేతల పాదయాత్ర జరుగుతుండటంతో.. పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. పాదయాత్రలో నేతలను కలుసుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తారని భావిస్తున్నారు. ఇక పాదయాత్ర దృశ్యాలను చూసేందుకు డ్రోన్ కెమరాలను ఏర్పాటు చేశారు. పాదయాత్రలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. కల్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.